ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Red Sandalwood | గత కొంతకాలంగా తప్పించుని తిరుగుతున్న మోస్ట్​ వాంటెండ్​ ఎర్రచందనం స్మగ్లర్​ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా లంకమల్ల అటవీ ప్రాంతంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు(Task Force Police) ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి ఎర్రచందనం స్మగ్లింగ్​ చేస్తున్న గ్యాంగ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (SP Ashok Kumar) వివరాలు వెల్లడించారు.

    లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తున్న ముఠాపై శనివారం పోలీసులు దాడులు చేశారు. ఇందులో భాగంగా మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి(Most Wanted Smuggler Naga Dastagiri Reddy)తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దస్తగిరి రెడ్డిపై 86 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, 34 చోరీ కేసులు ఉన్నాయి. ఏడాది నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని వల పన్ని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

    Red Sandalwood | 1,087 కిలోల ఎర్రచందనం స్వాధీనం

    పొద్దుటూర్​ పట్టణానికి చెందిన దస్తగిరి రెడ్డితో పాటు తుమ్మనబోయిన కృష్ణయ్య, ముదిరెడ్డి రామ్మోనహర్​రెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, శనివారపు బాలగంగిరెడ్డి, చక్రాయిపేట మండలం ఓబుల్​రెడ్డి గ్యాంగ్​గా ఏర్పడి స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్​ చేశామన్నారు. వాని నుంచి 52 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి బరువు 1087 కిలోలు ఉంటున్నారు.

    Red Sandalwood | మూడు సార్లు పీడీ యాక్ట్​..

    నాగ దస్తగిరి రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. అతనిపై గతంలో మూడు సార్లు పీడీ యాక్ట్​ కూడా పెట్టినట్లు ఎస్పీ వివరించారు. ఆయన భార్య లాలూబీపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయన్నారు. ఆమె ప్రస్తుతం జైలులో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే దస్తగిరి కుటుంబ సభ్యులు లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా ఎర్రచందనం స్మగ్లర్లని ఎస్పీ వెల్లడించారు.

    Latest articles

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    Office Politics | ఆఫీసులో నచ్చని వారితో కలిసి పనిచేయడం ఎలా?

    అక్షరటుడే, హైదరాబాద్ : Office Politics | ఆఫీసులో ఉద్యోగం(Office Job) అంటే కేవలం పని చేయడం మాత్రమే...

    Freeze Chicken | ఫ్రిజ్‌లోని చికెన్ తింటున్నారా? అయితే మీకు ఆ రిస్క్ ఎక్కువ

    అక్షరటుడే, హైదరాబాద్ : Freeze Chicken | ఆధునిక జీవనశైలిలో చాలామంది సౌలభ్యం కోసం చికెన్‌ను ఎక్కువ మొత్తంలో...

    More like this