ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | మల్లూరు గ్రామ సమస్యలు పరిష్కరించాలని వినతి

    Mla Laxmi Kantha Rao | మల్లూరు గ్రామ సమస్యలు పరిష్కరించాలని వినతి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha Rao | మల్లూరు (mallur) గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఆదివారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా మల్లూరు గ్రామ శివారులోని సర్వే నం.765లో ఉన్న రైతుల భూసమస్యను పరిష్కరించాలని వారు కోరారు. మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి మల్లూరు తండా బీటీ రోడ్డు వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మించాలని వారు వినతిపత్రంలో కోరారు. అలాగే ఏటిగడ్డ వద్ద సూదిరెడ్డి రాంరెడ్డి వ్యవసాయ పొలం వద్ద మాంజీర నదిపై హైలేవర్ బ్రిడ్జిని నిర్మించాల్సింగా వారు విన్నవించారు.

    అదేవిధంగా మల్లూరు తండా రోడ్డు నుండి పల్లె శివారులోని వ్యవసాయ భూముల ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న మాసిరెడ్డి చెరువు కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని సూచించారు. మల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) ప్రహరీని నిర్మింపజేయాలని విన్నవించారు.

    ఈ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఒంటరి శ్రీనివాస్ రెడ్డి, బుడిమి శ్రీనివాస్, పెద్ది అంజయ్య, నాగంపల్లి కృష్ణ, శ్రీధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను...

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...

    KTR | అలా చేసినట్లు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్...

    More like this