ePaper
More
    HomeతెలంగాణIndiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. ఇక ఆన్​లైన్​లో స్టేటస్​ చూసుకోవచ్చు

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. ఇక ఆన్​లైన్​లో స్టేటస్​ చూసుకోవచ్చు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. జనవరి 26న ఈ పథకాన్ని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు.

    మొదట కొన్ని గ్రామాల్లో పైలెట్​ ప్రాజెక్ట్​ కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అనంతరం నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశారు. తొలి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti)  తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. బేస్​మెంట్​ వరకు పనులు పూర్తయితే రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారు. అయితే తమ ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఎక్కడి వరకు వచ్చాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బిల్లుల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బిల్లులకు సంబంధించిన స్టేటస్​ లబ్ధిదారులు ఆన్​లైన్​లో చెక్​ చేసుకునేలా పోర్టల్​ అందుబాటులోకి తెచ్చింది.

    Indiramma Houses | ఆఫీస్​లకు వెళ్లకుండానే..

    ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్​లైన్​లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్టేటస్​లో వెబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. https://indirammaindlu.telangana.gov.in వెబ్​సైట్​లో లబ్ధిదారుల ఫోన్​ నంబర్​, ఆధార్​, రేషన్​ కార్డు వివరాలు నమోదు చేసి బిల్లుల చెల్లింపు స్టేటస్​ తెలుసుకోవచ్చు.

    Latest articles

    Hyderabad | ‘పిస్తా హౌస్’లో తింటున్నారా.. ఫుడ్​ సేఫ్టీ అధికారుల తనిఖీలో షాకింగ్​ విషయాలు వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో పిస్తా హౌస్ (Pista House)​ రెస్టారెంట్లకు మంచి గిరాకీ...

    Rains Alert | రానున్న 72 గంటల్లో భారీ, అతి భారీ వర్షాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Rains Alert | రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ...

    Bheemgal | జాతీయస్థాయి కథల పోటీలో ప్రత్యేక బహుమతి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | హైదరాబాద్​ (Hyderabad)లోని రవీంద్రభారతిలో ఇటీవల మాచిరాజు బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో...

    Kamareddy | ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు.. అభినందించిన ఎస్పీ

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కుటుంబ కలహాలతో కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను దేవునిపల్లి పోలీసులు...

    More like this