ePaper
More
    HomeజాతీయంDelhi metro | రాఖీ రోజు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన మెట్రో.. ఒక్క రోజులో 81.87...

    Delhi metro | రాఖీ రోజు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన మెట్రో.. ఒక్క రోజులో 81.87 లక్షల మంది ప్రయాణం!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi metro : రాఖీ పండుగ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో Delhi ప్రజలు ఎక్కువ‌గా ప్రయాణాలు చేయడంతో, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation – DMRC) స‌రికొత్త రికార్డ్ నమోదు చేసింది.

    ఆగస్టు 8వ తేదీన ఒక్కరోజులోనే 81,87,674 ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేశారు. ఇది ఇప్పటివరకు ఒకే రోజున నమోదైన అత్యధిక ప్రయాణాల రికార్డు.

    DMRC శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల గిరాకీ భారీగా పెరుగుతుందన్న అంచనాలతో మెట్రో అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు.

    Delhi metro : ఏకంగా అంత‌మంది ప్ర‌యాణం..

    ఆగస్టు 8న అదనంగా 92 ట్రిప్పులు, అలాగే రాఖీ పండుగ రోజు శనివారం (ఆగస్టు 9) నాడు 455 అదనపు ట్రిప్పులు నడిపి ప్రజలకు మెరుగైన సేవలందించారు. ఈ అద్భుతమైన సదుపాయాల‌కి గాను ప్రయాణికులు ఢిల్లీ మెట్రోను సోషల్ మీడియా వేదికగా ప్రశంసలతో ముంచెత్తారు.

    ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ, “ఇది ఓ మానవ సముద్రం”, “మెట్రో Metro లేకుంటే పండగ పూట ప్రయాణం ఊహించలేనిది” అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొన్ని స్టేషన్లు, రైళ్లు అంతగా కిక్కిరిసి ఉండగా, ప్రయాణికులు నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో తల్లడిల్లారు.

    రికార్డు స్థాయిలో ప్రయాణాలు చేయ‌డం చూసి మెట్రో సిబ్బందే షాక్‌కు గురయ్యారు. మెట్రో స్టేషన్లు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, రైళ్లలో.. అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లలో కనిపించే రద్దీ దృశ్యాలు తలపించాయి. అయినప్పటికీ, సిబ్బంది సమర్థంగా పని చేస్తూ ప్రయాణికుల Passengers రవాణాను సజావుగా నిర్వహించారు.

    ప్రస్తుతం ఢిల్లీ మెట్రో delhi metro దేశంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది. మొత్తం 400 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ నెట్‌వర్క్, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్, బహదూర్‌గఢ్ లాంటి పక్క పట్టణాలను కూడా కలుపుతోంది. రోజూ లక్షల మంది ఉద్యోగులు, విద్యార్థులు, వాణిజ్య ప్రయాణికులు ఈ సేవలపై ఆధారపడుతున్నారు.

    Latest articles

    Kamareddy BJP | గెలిచినప్పుడు ఈసీపై ఆరోపణలు ఎందుకు చేయలేదు..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | ఓటమి చెందినప్పుడు ఈసీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ, కర్ణాటక...

    Raja Singh | బీజేపీలో చేరికలపై రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)​ బీజేపీ (BJP)పై మరోసారి...

    TNGO’S Nizamabad | అంగన్​వాడీల సమస్యలను పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: TNGO'S Nizamabad |అంగన్​వాడీ (Anganwadi) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ (TNGO'S Nizamabad)​ జిల్లా...

    Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలు

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలైన ఘటన మండలకేంద్రంలో జరిగింది. స్థానికులు...

    More like this