ePaper
More
    Homeక్రీడలుSiraj Rakhi Celebration | రూమ‌ర్ల‌కి చెక్.. మహ్మద్ సిరాజ్‌కు ఆశా భోస్లే మనవరాలు రాఖీ...

    Siraj Rakhi Celebration | రూమ‌ర్ల‌కి చెక్.. మహ్మద్ సిరాజ్‌కు ఆశా భోస్లే మనవరాలు రాఖీ కట్ట‌డంతో వ‌చ్చిన క్లారిటీ..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Siraj Rakhi Celebration | టీమిండియా (Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు (Hyderabad player) మహమ్మద్ సిరాజ్ Siraj ఆట‌తోనే కాకుండా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో కూడా నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాడు.

    అయితే కొద్ది రోజులుగా ఆయ‌న ఆశా భోస్లే మనవరాలు జనాయ్ భోస్లేతో డేటింగ్‌లో ఉన్నాడ‌నే ప్ర‌చారాలు సాగాయి. ఈ నేప‌థ్యంలో జనాయ్ భోస్లే.. మహమ్మద్ సిరాజ్‌(Mohammed Siraj)కు రాఖీ కట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సిరాజ్ స్వ‌యంగా ఈ వీడియోని త‌న ఇన్‌స్టాలో షేర్ చేయ‌డంతో ఈ ఫెస్టివ్ మూమెంట్ మ‌రింత స్పెష‌ల్‌గా మారింది. సహచర ఆట‌గాడు రిషభ్ పంత్ కూడా లవ్ ఎమోజీతో స్పందించి తన శుభాకాంక్షలు తెలప‌డం విశేషం.

    Siraj Rakhi Celebration | ఇలా క్లారిటీ ఇచ్చారు..

    ఇదివరకూ సిరాజ్–జనాయ్ (Janai Bhosle) మధ్య డేటింగ్ Dating న‌డుస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రాఖీ వేడుకతో ఆ పుకార్లకు క్లియర్ కట్ సమాధానం ఇచ్చారు. ఇది అన్నాచెల్లెళ్ల బంధం.. అనే సందేశాన్ని వారు ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చెప్పారు.

    నిజంగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ వీరిద్దరినీ అభినందిస్తున్నారు. ఈ హ్యాపీ మూమెంట్‌లో ఇద్దరి మధ్య ఉన్న చెలిమి, అనుబంధం స్పష్టంగా కనిపించింది. జనాయ్ ఎంతో ప్రేమగా రాఖీ కడుతుండగా, సిరాజ్ ముచ్చటగా నవ్వుతూ ఆమెకు గిఫ్ట్ అందించాడు.

    ఈ వీడియోతో ఇటీవల చక్కర్లు కొడుతున్న డేటింగ్ రూమర్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇది రొమాంటిక్ రిలేషన్ కాదని, నిజమైన అన్నాచెల్లెళ్ల బంధం అని వీరిద్దరూ ఈ వీడియో ద్వారా తెలియ‌జేశారు.

    ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ..“ఇదే నిజమైన అనుబంధం”, “ఎంతో ప్యూర్ రిలేషన్‌షిప్”, “సిరాజ్‌కి హ్యాట్సాఫ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    ఇక ఇంగ్లండ్ England పర్యటనలో 23 వికెట్లు తీసి , సిరాజ్ తన కెరీర్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

    ఇప్పుడు టెస్ట్‌ల‌లో జస్‌ప్రీత్ బుమ్రా పాత్ర పరిమితంగా ఉండడంతో, సిరాజ్ ఇండియన్ పేస్ అటాక్‌కు లీడర్ గా మారాడు. ఫిట్‌నెస్, ఫోకస్, ఫైర్ అన్నీ సమపాళ్లలో మిళితమై, ప్రతి మ్యాచ్‌లో అతని పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా నిలిచింది.

    Latest articles

    Midday meal | మధ్యాహ్న భోజనం తనిఖీ

    అక్షరటుడే, భీమ్​గల్: Midday meal | పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం (nutritious food) అందించేందుకు రూ. వందల కోట్లు...

    Nizamsagar SI | దాబాలలో మద్యం సిట్టింగులు.. పలువురిపై కేసులు నమోదు

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar SI | నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్ నగర్ మండలాల్లోని (Mohammed Nagar mandal) పలు...

    Vote Chori | ఢిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ఢిల్లీ (Delhi)లో విపక్ష ఎంపీలు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు...

    Bodhan Town | బోధన్​ పట్టణంలో ఉర్సు ప్రారంభం

    అక్షరటుడే, బోధన్: Bodhan Town | పట్టణంలోని రెంజల్ బేస్​లో (Renjal Base) గల హజ్రత్ సయ్యద్ షా...

    More like this

    Midday meal | మధ్యాహ్న భోజనం తనిఖీ

    అక్షరటుడే, భీమ్​గల్: Midday meal | పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం (nutritious food) అందించేందుకు రూ. వందల కోట్లు...

    Nizamsagar SI | దాబాలలో మద్యం సిట్టింగులు.. పలువురిపై కేసులు నమోదు

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar SI | నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్ నగర్ మండలాల్లోని (Mohammed Nagar mandal) పలు...

    Vote Chori | ఢిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ఢిల్లీ (Delhi)లో విపక్ష ఎంపీలు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు...