ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Political Rakhi | రాఖీకి కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    Political Rakhi | రాఖీకి కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం. సోదరుల క్షేమం కోరుతూ సోదరీమణులు రాఖీ కడుతుంటారు. విజయం కాంక్షిస్తూ నోరు తీపి చేస్తుంటారు.

    రాఖీ (Rakhi) అంటే ‘రక్షణ’ (Raksha Bandhan). తమ తోడబుట్టిన వారికి ఎలాంటి అవాంతరాలు, ఆపదలు రాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కాంక్షిస్తూ ఆడపడుచులు తమ సోదరులకు రక్ష కడుతుంటారు.

    ఈ రక్షనే రాఖీగా పేర్కొంటారు. తమ అభ్యున్నతి, శ్రేయస్సుని కోరుకునే సోదరీమణులకు ఈ పర్వదినం సందర్భంగా సోదరులు కానుకలిస్తుంటారు.

    శనివారం (ఆగస్టు 9) రాఖీ పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖుల ఇళ్లలో ఉదయం నుంచే సందడి కొనసాగింది.

    తమ సోదరులు రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ.. సోదరీమణులు తమ రాజకీయ సోదరులకు రాఖీలు కట్టి, నోరు తీపి చేశారు. అన్న చేతుల మీదుగా కానుకలు అందుకున్నారు.

    Political Rakhi | వేడుకకు దూరం..

    కాగా, తెలంగాణలో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(BRS State Working President KTR)​, ఆంధ్రప్రదేశ్​లో వైఎస్​ఆర్​ సీపీ అధినేత వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి మాత్రం రాఖీ వేడుకకు దూరంగా ఉన్నారు.

    అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ రాఖీ పండగను తమ సోదరీమణులతో  కేటీఆర్​, జగన్​నిర్వహించుకోలేదు.

    ప్రస్తుతం ఈ అంశంపై అటు ఆంధ్రప్రదేశ్​లో, ఇటు తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. కేటీఆర్​ సోదరీమణి ఎమ్మెల్సీ కవిత తన అన్నకు రాఖీ కట్టేందుకు సుముఖత చూపలేదా.. లేక ఆమెతో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేక కేటీఆర్​ దూరంగా ఉన్నారా.. అనేది చర్చనీయాంశంగా మారింది.

    కవిత గతేడాది సైతం కేటీఆర్​కు రాఖీ కట్టలేకపోయారు. ఎందుకంటే లిక్కర్​ కుంభకోణం కేసులో ఆమె జైలులో ఉండటంతో నాడు ఈ వేడుకకు దూరం అయ్యారు. తాజాగా బీఆర్​ఎస్​ పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్ఛితి వల్ల దూరం అయినట్లు తెలుస్తోంది.

    హైదరాబాద్​లో కేటీఆర్ లేనందున ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత ఆయనకు రాఖీ కట్టలేకపోయారని చెబుతున్నారు. కాగా, కేటీఆర్​ కావాలనే అందుబాటులో ఉండకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

    అంటే ఆయన తన సోదరి కవితకు దూరంగా ఉండాలని నిశ్ఛయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రక్షాబంధన్​ రోజున కేటీఆర్​ తన సోదరి కవితకు అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు.

    Political Rakhi | నాడు జైలులో ఉండటం వల్ల.. నేడు అందుబాటులో ఉన్నా..

    రాఖీ కట్టేందుకు వస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తన అన్న కేటీఆర్​కు మెసేజ్ పంపినట్లు అంటున్నారు. కాగా, పార్టీ వర్క్​ మీద ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన రిప్లై ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.

    గతేడాది రాఖీ పండగ సమయంలో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉండిపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో కేటీఆర్​కు రాఖీ కట్టలేకపోయారు. అప్పట్లో కేటీఆర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన వేదనను వెలిబుచ్చారు. అందరి నుంచి సానుభూతి పొందారు.

    కాగా, ఈసారి కవిత అందుబాటులో ఉన్నా కూడా రాఖీ కట్టించుకోకుండా కేటీఆర్​ ఔట్​ ఆఫ్​ స్టేషన్​ అని రిప్లై ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో బహిరంగ రహస్యమే. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం తెగినట్లు స్పష్టం అవుతోంది.

    Political Rakhi | షర్మిల దూరం..

    ఆంధ్రప్రదేశ్​లో మాజీ సీఎం వైఎస్ జగన్​ (former Chief Minister YS Jagan Mohan Reddy, )పరిస్థితి సైతం ఇలాగే ఉంది. జగన్​కు ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య అగాధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్​ జగన్​కు షర్మిల రాఖీ కట్టలేదని ప్రచారంలో ఉంది.

    ఆంధ్రప్రదేశ్​లో అధికారానికి దూరమయ్యాక వైఎస్​ జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉండిపోతున్నారు. పార్టీ సమావేశాలకు మాత్రమే అమరావతికి వచ్చి వెళ్తున్నారు. ఇక వైఎస్ జగన్​కు, షర్మిల(Congress AP President YS Sharmila)కు మధ్య సంబంధాలు దాదాపు పూర్తిగా తగ్గిపోయినట్లే తెలుస్తోంది. అందుకే రాఖీ పర్వదినాన కూడా ఈ అన్నాచెల్లెళ్లు ఎడముఖం పెడముఖం అన్నచందంగా ఉన్నారని ప్రచారంలో ఉంది.

     

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 11 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ (Pingala) దక్షిణాయనం(Dakshinayanam) వర్ష...

    Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని చంద్రశేఖర్​ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) 2007–08...

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 11 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ (Pingala) దక్షిణాయనం(Dakshinayanam) వర్ష...

    Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని చంద్రశేఖర్​ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) 2007–08...

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...