ePaper
More
    Homeబిజినెస్​Stock market | ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    Stock market | ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(NIfty) ఏడు పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ కదలాడుతున్నాయి. తమపై భారత్‌(Bharath) దాడి చేసే అవకాశాలున్నాయని పాక్‌ పేర్కొంటుండడం, ఉగ్రదాడి ఘటనకు భారత్ బదులు తీర్చుకునే అవకాశాలు ఉండడం, ప్రధాని మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ కావడం, గురువారం మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 80,330 వద్ద, నిఫ్టీ 15 పాయిట్ల లాభంతో 24,300 వద్ద కొనసాగుతున్నాయి. క్యూ4 ఫలితాలు బాగుండడంతో విశాల్‌ మెగా మార్ట్‌(Vishal Mega Mart) 9 శాతానికిపైగా పెరిగింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు మంచి ఫలితాలనే ఇచ్చినా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఒలటాలిటీ(Volitility) పెరిగింది.

    Stock market | పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..

    రియాలిటీ ఇండెక్స్‌(Reality Index) 3 శాతానికిపైగా పెరగ్గా.. ఫార్మా సూచీ ఒక శాతం లాభంతో ఉంది. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ ఒక శాతానికిపైగా నష్టంతో కొనసాగుతోంది. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా కదలాడుతుండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

    Stock market | Top Gainers..

    బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ముగియగా 13 కంపెనీలు నష్టాలతో కొనసాగుతున్నాయి. మారుతి(Maruti) 3 శాతం పెరగ్గా.. పవర్‌ గ్రిడ్‌, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి.

    Stock market | Top Losers..

    బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు 5 శాతానికిపైగా పడిపోయాయి. టాటా మోటార్స్‌(Tata motors) 3 శాతానికిపైగా లాభంతో ఉండగా ఎస్‌బీఐ 2.60 శాతం నష్టంతో కదలాడుతోంది.

    More like this

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం (Heavy Rain)...

    Indian origin man beheaded | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి తల నరికి.. విసిరేశాడు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికా America లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది....

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...