ePaper
More
    HomeFeaturesTo Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO LET) ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. సాంప్రదాయ ప్రకటనల నుంచి పూర్తిగా భిన్నంగా ఉన్న ఈ యాడ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే అక్కసు, ఆంక్షలే ఎక్కువ’ అనే ట్యాగ్‌లైన్‌కు విరుద్ధంగా… ఈ ప్రకటన అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. శివానీ అనే యువతి బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ట్రిపుల్​ బెడ్‌రూం ఫ్లాట్‌లో ఒక గదిని అద్దెకు ఇవ్వాలని ఎక్స్‌ వేదికగా ఓ యాడ్ పోస్టు చేసింది. అయితే, ఆమె పెట్టిన కండీషన్లు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

    To Let | విచిత్ర ప్ర‌క‌ట‌న‌

    మహిళలకు మాత్రమే అన్న ప్రాథమిక షరతుతో పాటు, “దయగా ఉంటే చాలు, మీరు దయ్యాలను పూజించినా నాకు ప్రాబ్లం లేదు” అనే కామెంట్‌తో నెటిజన్లను నవ్వించింది. ఆమె ప్రకటనలో పొగ తాగడం, మద్యం సేవించడం, మాంసాహారాహారం తినడం వంటి విషయాల్లో ఎలాంటి ఆంక్షలూ లేవని పేర్కొనడం గమనార్హం. పెంపుడు జంతువులు (Pets) అంటే త‌న‌కెంతో ఇష్టమని, ఇంట్లోకి వ‌చ్చే వారు పెట్‌తో వస్తే తనకెంతో ఆనందం కలుగుతుందన్న మాటలు పలువురు నెటిజన్ల మనసుల‌ని హ‌త్తుకున్నాయి. ఈ ఫ్లాట్‌కి తనకు ప్రత్యేక అనుబంధముందని చెప్పిన శివానీ, ఇప్పటివరకు తాము కలిసి ఉన్న ఫ్లాట్‌మేట్స్ మంచి స్నేహితులయ్యామ‌ని, అదే బాండ్‌ను కొనసాగించాలనుకుంటున్నానని పేర్కొంది.

    పూర్తి ఫర్నీచర్‌తో కూడిన బెడ్‌రూం (Bed Room) ఫొటోలతో పాటు ఇతర సౌకర్యాలను కూడా వివరంగా జత చేసింది. ఈ యాడ్ చూసిన నెటిజన్లు హమ్మయ్యా.. ఇలాంటి ఓనర్ లభిస్తే బాగుండే అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఈ ప్రకటనను స్ర్కీన్‌షాట్ తీసుకొని తమకు తెలిసిన వారికి షేర్ చేస్తూ.. “ఇది నిజమైన బెంగళూరు వైబ్” అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక బెడ్‌రూం అద్దె ప్రకటన ఇలా దేశవ్యాప్తంగా వైరల్ కావడం క్రేజీగా అనిపించినా… శివానీ స్నేహపూర్వక దృక్పథం, ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్​కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

    Latest articles

    Freeze Chicken | ఫ్రిజ్‌లోని చికెన్ తింటున్నారా? అయితే మీకు ఆ రిస్క్ ఎక్కువ

    అక్షరటుడే, హైదరాబాద్ : Freeze Chicken | ఆధునిక జీవనశైలిలో చాలామంది సౌలభ్యం కోసం చికెన్‌ను ఎక్కువ మొత్తంలో...

    Parking Space | పార్కింగ్​ కోసం 15 అంతస్తుల బిల్డింగ్​.. నాంపల్లిలో త్వరలో అందుబాటులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parking Space | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ట్రాఫిక్​ కష్టాలు అన్ని ఇన్ని కావు....

    Egg Puff | ఎగ్ పఫ్స్‌లో సగం గుడ్డే ఎందుకుంటుందో తెలుసా?

    అక్షరటుడే, హైదరాబాద్: Egg Puff | టీ టైంలో లేదా సాయంత్రం వేళల్లో చాలామంది ఇష్టపడే స్నాక్స్‌లో ఎగ్...

    Kidney problems | ఐదు చిట్కాలతో కిడ్నీ సమస్యలు దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kidney problems | మన దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. కిడ్నీ...

    More like this