Lords ground

Lords ground | లార్డ్స్‌లోని గ‌డ్డి పరకను రూ.5 వేల‌కు ద‌క్కించుకునే అవ‌కాశం.. 25,000 మందికే ఛాన్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lords ground | ‘క్రికెట్ కా మక్కా’గా ప్రసిద్ధిగాంచిన లార్డ్స్ చారిత్రక మైదానంలో (Lords ground)  జరిగిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఇప్పుడు, అదే మైదానంలోని గడ్డి పరకను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కల్పిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లార్డ్స్ మైదానాన్ని పునర్నిర్మించేందుకు నిర్ణయించిన MCC, పాత పిచ్ గడ్డిని తొలగించబోతోంది. అయితే, దానిని వృథా చేయకుండా అభిమానులకు గుర్తుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. మైదానంలోని పాత గడ్డి ముక్కలను 50 పౌండ్లకు (సుమారు రూ.5000) విక్రయించబోతోంది. ఒక్కో టర్ఫ్ ముక్క 1.2 x 0.6 మీటర్ల పరిమాణంలో ఉంటుంది.

Lords ground | మిస్ కావొద్దు..

ఈ గడ్డి పరకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిని సెప్టెంబర్ 29 లేదా 30 తేదీలలో లార్డ్స్‌కు వెళ్లి స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది. క్లబ్ సభ్యులతో పాటు సాధారణ అభిమానులు కూడా ఈ అవకాశాన్ని పొందవచ్చు. ఈ ప్రత్యేక అమ్మకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.. ఎంసీసీ ఫౌండేషన్ కోసం నిధులు సేకరించడం. విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 10% భాగం ఈ ఫౌండేషన్‌కు ఇవ్వబడుతుంది. ఇది యువ క్రికెటర్లను (Young Cricketers) ప్రోత్సహించేందుకు, క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మిగతా మొత్తం మైదాన అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

లార్డ్స్ మైదానంలో జరిగిన ఎన్నో అద్భుత మ్యాచ్‌ల గుర్తుగా, ఇప్పుడు క్రికెట్ అభిమాని తన ఇంట్లో గడ్డిముక్క రూపంలో ఓ చరిత్రని నిలుపుకోగలుగుతాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (Shubman Gil) నాయకత్వంలో భారత్ ఘన విజయం సాధించిన దృశ్యాల నుంచి… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (World Test Championship final) వరకు ఎన్నో విశేషాల్ని చూసిన ఈ పిచ్ ఇప్పుడు అభిమానుల ఆస్తిగా మారనుంది. ఈ అపురూప అవకాశాన్ని మిస్ కావద్దు ,ఎందుకంటే ఇది “ఒక్కసారి మాత్రమే దొరికే చారిత్రక అవకాశం!