KL Rahul

KL Rahul | ఇది పొర‌పాటు కాదు, కేఎల్ రాహుల్‌ని కావాల‌నే అవ‌మానించారు… సోష‌ల్ మీడియా పోస్ట్‌తో రాజుకున్న వివాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KL Rahul | ఇటీవల ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో (Anderson-Tendulkar Trophy) టీమిండియా అద్భుతంగా పోరాడి సిరీస్‌ను 2-2తో సమం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విజయానికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అందించిన మద్దతు అపూర్వం.

ఇంగ్లండ్ పిచ్‌లపై అత్యంత కఠిన పరిస్థితుల్లో 53.20 సగటుతో 532 పరుగులు చేసి, సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కానీ… అతని మాజీ ఐపీఎల్ జట్టు అయిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మాత్రం ఈ అద్భుత ప్రదర్శనను గౌరవించలేదు. తాజాగా వారు పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నూతన వివాదానికి దారితీసింది. లక్నో సూపర్ జెయింట్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో భారత జట్టు సాధించిన విజ‌యానికి శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో కొల్లాజ్ షేర్ చేశారు.

KL Rahul | మ‌రో వివాదం..

అందులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ వంటివారి ఫోటోలు ఉన్నాయి. అయితే… అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన కేఎల్ రాహుల్ ఫోటో మాత్రం ఎక్కడా లేదు. ఇది అభిమానులకి ఆగ్ర‌హం తెప్పించింది . ఇది కేవలం ‘పొరపాటు’ కాదని, కావాలనే చేసిన‌ చర్యగా అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై మాజీ భారత పేసర్ డోడా గణేష్ స్పందిస్తూ తీవ్రంగా స్పందించారు. కొత్త బంతిని ఎదుర్కొంటూ 500+ పరుగులు చేసిన ఓపెనర్ ఒక్క ఫోటో మీకు దొరకలేదా? ఇది నిజంగా అసహ్యంగా ఉంది.” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . అభిమానులు కూడా సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో స్పందిస్తూ .. “వారు కావాలనే రాహుల్‌ను చిన్నచూపు చూసే ప్రయత్నం చేశారు”.“లక్నో (Lucknow) ఎప్పుడూ ఇలానే చేస్తుంది”,ఇది కేవలం స్కోర్‌ బోర్డుకే కాదు, మానవతా విలువలకు అవమానం అంటూ మండిపడుతున్నారు.

రాహుల్‌తో వివాదం ఏంటంటే.. అప్పట్లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించగా, కొన్ని మ్యాచ్‌ల్లో జట్టు అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, మైదానంలోనే రాహుల్‌పై అసహనం వ్యక్తం చేస్తూ బహిరంగంగా వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది.త‌ర్వాత సీజన్ ముగిసిన వెంటనే లక్నో జట్టు రాహుల్‌ను త‌ప్పించింది. దీంతో అతనిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక లక్నో రూ.27 కోట్ల భారీ ధరకు రిషబ్ పంత్‌ (Rishabh Pant)ను కొనుగోలు చేసి కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. అయితే వివాదాలపై స్పందించకుండా, తన ఆటతీరుతోనే ఎప్పుడు స‌మాధానం ఇస్తుంటాడు కేఎల్ రాహుల్.