అక్షరటుడే,బాన్సువాడ: Padmashali sangham | పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జంజీరాల పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులతో పద్మశాలీ మహిళలు, పురుషులు జంజీరాలను ధరించి స్వామివారికి మంగళహారతులు సమర్పించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla pocharam Srinivas Reddy) హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంజీరాల పూర్ణిమ పద్మశాలీలకు ఆత్మీయమైన పండుగ అని అన్నారు. పోచారం, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ను (kasula Balraj) సంఘం సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, అచ్చుకట్ల జీవన్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.