అక్షరటుడే, వెబ్డెస్క్ : Ind – Pak | పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attackతో ఆగ్రహంగా ఉన్న భారత్ bharat పాక్కు బుద్ధి చెప్పాలని చూస్తోంది. ఇప్పటికే ఆ దేశంతో వాణిజ్యం బంద్ చేసుకున్న భారత్, సింధూ నది Indus River జలాలు ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసింది. అంతేగాకుండా ఆ దేశానికి భారత్కు చెందిన ఏ వస్తువులు ఎగుమతి కాకుండా చర్యలు చేపట్టింది. తాజాగా ఆ దేశంపై భారత్ ఆర్థిక యుద్ధానికి economic war సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ Economy పతనం అయిపోయింది. అప్పులు తెచ్చుకుంటేగాని పూట గడవని పరిస్థితి. ద్రవ్యోల్బణం Inflation విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయంలో పాక్కు అప్పు పుట్టకుండా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ IMF లోన్ Loan ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారని ఐఎంఎఫ్ సభ్యులకు భారత ప్రతినిధులు వివరించారు. కాగా మే 9న పాకిస్తాన్‌కు అప్పుపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. దాయదీ దేశానికి ఎట్టిపరిస్థితుల్లో అప్పు ఇవ్వొద్దని భారత్ వాదిస్తోంది. ఒకవేళ పాక్కు అప్పు లభించకపోతే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.
