ePaper
More
    HomeసినిమాSSMB29 | మ‌హేష్ బాబు బ‌ర్త్ డే స్పెష‌ల్.. స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాజ‌మౌళి

    SSMB29 | మ‌హేష్ బాబు బ‌ర్త్ డే స్పెష‌ల్.. స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాజ‌మౌళి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SSMB29 | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులతో పాటు ఘట్టమనేని కుటుంబాన్ని అభిమానించే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి.

    ఎందుకంటే, పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న మహేష్ బాబు – రాజమౌళి చిత్రం నుండి అప్‌డేట్ అయితే వచ్చేసింది. ఇన్నాళ్లు ఈ సినిమా నుండి ఒక్క అప్‌డేట్ అయినా ఇవ్వండ‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ (first look poster) నవంబర్ 2025లో షేర్ చేయనున్నట్లు తెలిపారు. జక్కన్న షేర్ చేసిన పోస్టర్లో మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ వేలాడుతూ క‌నిపిస్తుంది. ఇక మెడపై నుంచి రక్తం కారుతున్న‌ట్టుగా పోస్ట‌ర్‌లో ఉంది. ఇది చూసి ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.

    READ ALSO  Megastar Chiranjeevi | ప్ర‌తి సంవత్సరం మ‌రింత యంగ్‌గా మారుతున్నారు... మ‌హేష్‌కి చిరంజీవి స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్

    SSMB29 | అంచ‌నాలు పెరిగాయి..

    మొత్తం రివీల్ చేయ‌క‌పోయిననా, క‌నీసం ప్రీ లుక్‌తో (Pre Look) అయినా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశార‌ని అంటున్నారు. మ‌రోవైపు రాజ‌మౌళి త‌న పోస్ట్‌లో ఆస‌క్తిక‌ర సందేశం రాసుకొచ్చారు. “ఈ సినిమా షూటింగ్ మేము కొద్ది రోజుల క్రిత‌మే ప్రారంభించాము. సినిమాపై మీ అంద‌రు చూపిస్తున్న ఆస‌క్తి ప‌ట్ల మేము సంతోషంగా ఉన్నాము. భారీ స్థాయిలో మూవీని రూపొందిస్తున్నాము. ప్రెస్ మీట్స్ పెట్టో లేకుంటే ఫొటోలు విడుద‌ల చేసో మేము ఈ సినిమా క‌థ‌కి పూర్తి స్థాయిలో న్యాయం చేయ‌లేము. చిత్రాన్ని అద్భుతంగా, డిఫ‌రెంట్‌గా చిత్రీక‌రిస్తున్నాము. మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 2025లో రిలీజ్ చేస్తాము. ఇది గ‌తంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. మీ అందరి సహకారం, మద్దతు కొన‌సాగిస్తార‌ని న‌మ్ముతున్నాము” అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

    READ ALSO  Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    మహేష్ బాబు -రాజమౌళి (Mahesh Babu – Rajamouli) కాంబో అనగానే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకు రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ మూవీపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తూ ఉన్నారు. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక, చిత్ర బృందం ఒడిశాకు వెళ్లింది. అక్కడ కొన్ని విజువల్స్ లీక్ అయినా, జక్కన్న మాత్రం దాని గురించి మాట్లాడ‌లేదు.

    ఇక ఇప్పటి వరకు అనేక సినిమాల ఫంక్షన్లకు హాజరైనప్పటికీ, SSMB29 గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. చిత్రంలో కథానాయికగా ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) న‌టిస్తుండ‌గా, ప్రముఖ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి అందిస్తున్నారు.

    READ ALSO  Jatadhara | జ‌టాధ‌ర టీజ‌ర్ టైమ్ ఫిక్స్.. ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్‌తో హైప్ పెంచేశారుగా..!

    Latest articles

    BCCI | రోహిత్‌కి చెక్ పెట్టేలా బీసీసీఐ కొత్త ఎత్తులు.. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌రకు ఆడ‌డం క‌ష్ట‌మేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ప్ర‌స్తుతం టీమిండియాలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వ‌న్డే, టెస్ట్‌ల...

    Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన...

    Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Red Sandalwood | గత కొంతకాలంగా తప్పించుని తిరుగుతున్న మోస్ట్​ వాంటెండ్​ ఎర్రచందనం స్మగ్లర్​ను...

    PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో మన సత్తా చాటాం : ప్రధాని మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో ప్రపంచానికి మన సత్తా చాటామని ప్రధాన మంత్రి...

    More like this

    BCCI | రోహిత్‌కి చెక్ పెట్టేలా బీసీసీఐ కొత్త ఎత్తులు.. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌రకు ఆడ‌డం క‌ష్ట‌మేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ప్ర‌స్తుతం టీమిండియాలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వ‌న్డే, టెస్ట్‌ల...

    Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన...

    Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Red Sandalwood | గత కొంతకాలంగా తప్పించుని తిరుగుతున్న మోస్ట్​ వాంటెండ్​ ఎర్రచందనం స్మగ్లర్​ను...