ePaper
More
    HomeజాతీయంJammu and Kashmir | జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హతం.. ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు...

    Jammu and Kashmir | జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హతం.. ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu and Kashmir | జ‌మ్మూకాశ్మీర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఇద్ద‌రు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందారు.

    జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఇద్దరు జ‌వాన్లు మృతి చెంద‌గా, నలుగురు సైనికులు గాయపడ్డారు. భద్రతా దళాలతో (security forces) జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

    ఈ మేర‌కే ఎన్‌కౌంట‌ర్ వివ‌రాల‌ను భారత సైన్యం Xలో వెల్ల‌డించింది. పోస్ట్‌ను షేర్ చేసింది. “దేశం కోసం విధి నిర్వహణలో ధైర్యవంతులైన ఎల్/ఎన్‌కె ప్రిత్‌పాల్ సింగ్, సెప్ హర్మీందర్ సింగ్ చేసిన అత్యున్నత త్యాగాన్ని చినార్ కార్ప్స్ గౌరవిస్తుంది. వారి ధైర్యం, అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. వారి మృతికి ఇండియన్ ఆర్మీ (Indian Army) ప్రగాఢ సంతాపాన్ని ప్ర‌క‌టించింది. మరణించిన కుటుంబాలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఉగ్ర‌వాదుల ఏరివ‌త ఆపరేషన్ కొనసాగుతోంది” అని తెలిపింది.

    READ ALSO  Tamil Nadu | భార్య తల నరికి నేరుగా టీవీ ఛానెల్‌కు.. నిందితుడు కానిస్టేబుల్​

    Jammu and Kashmir | ఆపరేషన్ అఖల్

    జ‌మ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌లో (Kulgam) ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను నిర్వీర్యం చేసేందుకు ఆర్మీ ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆగస్టు 1న ఆపరేషన్ అఖల్ (Operation Akhal) పేరిట సోదాలు నిర్వ‌హిస్తోంది.

    నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు.. భారత సైన్యం, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా భారీ కార్డన్. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఆపరేషన్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఉగ్రవాద నిరోధక డ్రైవ్‌లో ఇప్పటివరకు 13 మంది సైనికులు గాయపడ్డారు.

    Latest articles

    BCCI | రోహిత్‌కి చెక్ పెట్టేలా బీసీసీఐ కొత్త ఎత్తులు.. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌రకు ఆడ‌డం క‌ష్ట‌మేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ప్ర‌స్తుతం టీమిండియాలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వ‌న్డే, టెస్ట్‌ల...

    Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన...

    Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Red Sandalwood | గత కొంతకాలంగా తప్పించుని తిరుగుతున్న మోస్ట్​ వాంటెండ్​ ఎర్రచందనం స్మగ్లర్​ను...

    PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో మన సత్తా చాటాం : ప్రధాని మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో ప్రపంచానికి మన సత్తా చాటామని ప్రధాన మంత్రి...

    More like this