ePaper
More
    Homeక్రీడలుVirat Kohli | వ‌న్డేల‌కి రెడీ అవుతున్న విరాట్ కోహ్లీ.. బ్యాట్ ప‌ట్టుకొని ప్రాక్టీస్ షురూ..!

    Virat Kohli | వ‌న్డేల‌కి రెడీ అవుతున్న విరాట్ కోహ్లీ.. బ్యాట్ ప‌ట్టుకొని ప్రాక్టీస్ షురూ..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు.

    ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న కోహ్లీ, తాజాగా ఇండోర్ స్టేడియంలో (indoor stadium) ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ ప్రాక్టీస్ సమయంలో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్ తో కలిసి శ్రమిస్తున్న ఫోటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఆ ఫోటోకు జతగా.. “ప్రాక్టీస్‌లో సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.” అంటూ రాసుకొచ్చాడు.

    Virat Kohli  | ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

    కోహ్లీని ఆగష్టులో మళ్లీ మైదానంలో చూడాలని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్ ఈ నెలలో జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబరుకు వాయిదా వేశారు. కొన్ని కార‌ణాల వ‌ల‌న బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు అక్టోబర్ వరకూ ఎదురుచూడాల్సిందే.

    READ ALSO  Pakistan Cricketer | ఆ క్రికెట‌ర్‌పై అత్యాచారం కేసు.. ఏకంగా ఎన్నేళ్లు జైలు శిక్ష ప‌డుతుంది అంటే..!

    అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ మళ్లీ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా కోహ్లీతో పాటు జట్టులోకి చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోహ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ప్రాక్టీస్ మోడ్‌లోకి వెళ్లడంతో, తిరిగి మైదానంలో ఆయన మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    కాగా, కొద్ది నెల‌ల క్రితం టీ20, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం లండ‌న్‌లోనే ఉంటున్నాడు. త‌న భార్య‌ అనుష్క శర్మ (Anushka Sharma), పిల్ల‌లు వామికా ,అకాయ్‌ల‌తో క‌లిసి పూర్తిగా లండన్‌లోనే జీవనం కొనసాగిస్తున్నారు. పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత లండ‌న్‌లో ఉండాల‌ని ఈ జంట ప్లాన్ చేయ‌గా, వారి నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

    READ ALSO  IND vs ENG | గెలుపు ముంగిట భార‌త్, ఇంగ్లండ్‌.. ఎవ‌రు గెలుస్తారా అని టెన్ష‌న్ టెన్ష‌న్

    ఇక విరాట్ కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఆడనుండ‌గా, బహుశా 2027 వన్డే వరల్డ్‌కప్ త‌ర్వాత విరాట్ రిటైర్ కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ లోపే రోహిత్, కోహ్లిలు రిటైర్మెంట్ ప్రకటించేలా బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో జోరుగా వార్త‌లు రావ‌డం మ‌నం చూశాం.

    Latest articles

    BCCI | రోహిత్‌కి చెక్ పెట్టేలా బీసీసీఐ కొత్త ఎత్తులు.. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌రకు ఆడ‌డం క‌ష్ట‌మేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ప్ర‌స్తుతం టీమిండియాలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వ‌న్డే, టెస్ట్‌ల...

    Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన...

    Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Red Sandalwood | గత కొంతకాలంగా తప్పించుని తిరుగుతున్న మోస్ట్​ వాంటెండ్​ ఎర్రచందనం స్మగ్లర్​ను...

    PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో మన సత్తా చాటాం : ప్రధాని మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో ప్రపంచానికి మన సత్తా చాటామని ప్రధాన మంత్రి...

    More like this

    BCCI | రోహిత్‌కి చెక్ పెట్టేలా బీసీసీఐ కొత్త ఎత్తులు.. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌రకు ఆడ‌డం క‌ష్ట‌మేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ప్ర‌స్తుతం టీమిండియాలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వ‌న్డే, టెస్ట్‌ల...

    Indiramma Housing Scheme | 13న ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీన...

    Red Sandalwood | ఎర్రచందనం స్మగ్లర్ల​ అరెస్ట్​.. రూ.కోటి విలువైన దుంగల స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Red Sandalwood | గత కొంతకాలంగా తప్పించుని తిరుగుతున్న మోస్ట్​ వాంటెండ్​ ఎర్రచందనం స్మగ్లర్​ను...