అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy rain | రాష్ట్రంలో శనివారం భారీ వర్షం (heavy rain) కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. కాగా శనివారం ఉదయం సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో (Vikarabad districts) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతరం వర్షాలు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు విస్తరించనున్నాయి.
నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, జనగామ, వరంగల్, ములుగు జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట తేలిక పాటి వర్షం పడనుంది. పటాన్చెరు, ఇస్నాపూర్, అమీన్పూర్ ప్రాంతాల్లో వర్షాలు పడుతాయి. మిగతా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Heavy rain | రైతుల హర్షం
రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల పాటు వరుణుడు ముఖం చాటేయడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిముఖం పట్టాయి. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో పంటలకు జీవం వచ్చింది.
Heavy rain | హైదరాబాద్లో రోడ్లు జలమయం
హైదరాబాద్ నగరంలో (Hyderabad city) శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక్కసారిగా వాన పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో మూడు రోజులుగా నిత్యం సాయంత్రం వర్షం పడుతుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు.