అక్షరటుడే, కామారెడ్డి: Collector kamareddy | జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రజలకు సూచించారు. పాల్వంచ మండలంలోని భవానీపేట్ (Bhavanipet) నుండి పోతారం (potharam) వెళ్లే దారిలో భావానీపేట్ వాగు ఉధృతిని అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి పరిశీలించారు.
నీటి ఉధృతి అధికంగా ఉన్నందున నీటి ప్రవాహం వంతెన కంటే ఒక ఫీట్ వరకు రాకముందే ఈ దారిలో వాహనాలను నిలిపివేయాలని ఆర్అండ్బీ ఈఈ మోహన్, డీఈలను ఆదేశించారు. జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్ష సూచికలు తీసుకొని గ్రామాల వాట్సాప్ గ్రూపులు, దండోరా ద్వారా ప్రజలకు సమాచారం చేరవేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.