అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని మత్తమాల పీహెచ్సీ (Mattamala PHC) పరిధిలోని అల్మాజీపూర్లో (Almajipur) శుక్రవారం దోమల నివారణపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పీహెచ్సీ వైద్యాధికారి శరత్ ఆధ్వర్యంలో సబ్ యూనిట్ ఆఫీసర్ పాశం గోవిందరెడ్డి, హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి జనార్దన్ రెడ్డి అల్మాజీపూర్లో పర్యటించారు. దోమల నివారణపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే (Fever survey) చేశారు. రెండు లార్వా పాజిటివ్ ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించారు.
పెద్ద వాటర్ ట్యాంకుల వద్ద ఓపెన్ డ్రెయినేజీల్లో, ఇళ్ల పరిసరాల్లో పెద్దదోమలను తొలగించేందుకు తిమోఫాస్ మిశ్రమాన్ని స్ప్రే చేయించారు. మలేరియా (Malaria) జ్వరం అనుమానంతో ఉన్న రోగుల నుండి రక్తనమూనాలను (Blood samples) సేకరించారు.
జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు ఉన్న రోగులకు చికిత్స చేసి ఉచితంగా మందులు అందజేశారు. ‘ఫ్రైడే-డ్రైడే’లో (Friday-Dryday) పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో రాణి, రాజేశ్వరి ఆరోగ్య పర్యవేక్షకులు స్థానిక ఆరోగ్య కార్యకర్త పార్వవ్వ, ఆశా కార్యకర్తలు అంజమని, సుశీల పంచాయతీ కారోబార్ నరేష్, సిబ్బంది రత్నయ్య పాల్గొన్నారు.