ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | గుడిలో సొత్తే కాదు.. ఏకంగా దేవుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు

    Nizamabad City | గుడిలో సొత్తే కాదు.. ఏకంగా దేవుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | సాయిబాబా ఆలయంలో (Saibaba temple) దోపిడి దొంగలు హల్​చల్​ సృష్టించారు. ఈ ఘటన నగరంలోని 17వ డివిజన్​లో రాజీవ్​నగర్​ (Rajiv anagar) కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

    3వ టౌన్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్​నగర్​ ఆలయం సమీపంలోని సాయిబాబా ఆలయంలో అర్ధరాత్రి చొరబడ్డారు. ఆలయంలోని 30 తులాల వెండి కిరీటం, 4 కిలోల ఇత్తడి సాయిబాబా విగ్రహం, చెమాయిలు, రాగి చెంబులు, మంగళహారతి సామగ్రి తదితర విలువైన వస్తువులన్నీ దోచుకెళ్లారు.

    ఉదయం ఆలయ అర్చకులు గుడికి వెళ్లగా తలుపులు తెరిచి ఉండడం.. సాయిబాబా విగ్రహంతో సహా వస్తువులన్నీ మాయమవడంతో వెంటనే 3వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...