ePaper
More
    HomeతెలంగాణEagle Team | గంజాయికి బానిసలైన వైద్య విద్యార్థులు.. డీ అడిక్షన్​ సెంటర్​కు తరలింపు

    Eagle Team | గంజాయికి బానిసలైన వైద్య విద్యార్థులు.. డీ అడిక్షన్​ సెంటర్​కు తరలింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్(Hyderabad)​ నగరంలో గంజాయి, డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. చాలా మంది వీటి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ వైద్య కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు(Medical College Students) సైతం గంజాయికి బానిసలు మారారు. తాజాగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని డీ అడిక్షన్​ సెంటర్​కు తరలించారు.

    తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను ఉన్నత విద్య నిమిత్తం మహా నగరానికి పంపిస్తున్నారు. ఇక్కడే హాస్టళ్లు, రూముల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే పలువురు విద్యార్థులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్​కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లలు చదువుకుంటున్నారని ఇంటి దగ్గర తల్లిదండ్రులు భావిస్తుండగా.. వీరు మాత్రం వ్యసనాలకు అలవాటు ఆరోగ్యాలు పాటు చేసుకుంటున్నారు.

    Eagle Team | రిసాలబజార్​ కేంద్రంగా..

    హైదరాబాద్​లోని రిసాలబజార్​ కేంద్రం(Risal Bazaar Center)గా కొంతకాలంగా గంజాయి దందా సాగుతోంది. నగరంలో గంజాయి, డ్రగ్స్​ అరికట్టడానికి ఈగల్​ టీమ్​(Eagle Team )చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రిసాల బజార్​ కేంద్రంగా సాగుతున్న దందాపై ఈగల్​ టీమ్​ సభ్యులు దాడి చేశారు. డ్రగ్స్​ విక్రయిస్తున్న వారితో పాటు, వాటిని తీసుకుంటున్న 81 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు(Medical Students) ఉండటం గమనార్హం.

    Eagle Team | బైక్​పై వచ్చి విక్రయం

    బొల్లారం రిసాలబజార్‌లో గల ఓ పాఠశాల గ్రౌండ్​కు తరచూ ఓ యువకుడు బైక్​ వచ్చి గంజాయి విక్రయించేవాడు. ఈ మేరకు ఈగల్​ టీమ్​కు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి నిందితుడు అరాఫత్‌ అహ్మద్‌ ఖాన్‌(23)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక(Karnataka)లోని బీదర్‌లో జరీనా బాను అనే మహిళ వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆమెను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు.

    Eagle Team | 9 మందికి పాజిటివ్​

    అరాఫత్‌ వద్ద 100 మంది గంజాయి కొనుగోలు చేసినట్లు ఈగల్​ టీమ్​ గుర్తించింది. ఇందులో ఓ మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందికి పోలీసులు డ్రగ్స్​ టెస్ట్​ చేయగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. వీరు కాలేజీ హాస్టల్​లో ఉండి చదువుకుంటున్నారు. ఇందులో ఇద్దరు యువతులు కూడా ఉండటం గమనార్హం. 9 మంది విద్యార్థులకు పోలీసులు కౌన్సెలింగ్​ ఇచ్చి డీ-అడిక్షన్‌ సెంటర్(De Addiction Center)​కు తరలించారు.

    Latest articles

    IBPS Clerk Notification | బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టులు.. భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IBPS Clerk Notification | బ్యాంకింగ్‌ రంగం(Banking sector)లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి...

    Jenda Balaji Temple | 24 నుంచి జెండా జాతర ఉత్సవాలు

    అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు (Flag Fair)...

    PM Modi | అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ.. టారిఫ్ బాదుడు త‌ర్వాత తొలిసారి యూఎస్‌కు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు...

    Pakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. డీఆర్‌డీవో ఉద్యోగి అరెస్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Spy | పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేస్తున్న డీఆర్‌డీవో ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    More like this

    IBPS Clerk Notification | బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టులు.. భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IBPS Clerk Notification | బ్యాంకింగ్‌ రంగం(Banking sector)లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి...

    Jenda Balaji Temple | 24 నుంచి జెండా జాతర ఉత్సవాలు

    అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు (Flag Fair)...

    PM Modi | అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ.. టారిఫ్ బాదుడు త‌ర్వాత తొలిసారి యూఎస్‌కు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు...