అక్షరటుడే, వెబ్‌డెస్క్: Highway Infra : హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్(Highway infrastructure) కంపెనీ ఐపీఓ(IPO) కు ఇన్వెస్టర్ల నుంచి అద్భుత స్పందన లభించింది. 316.64 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్(Over subscribe) అయ్యింది. కంపెనీ షేర్లు 12న స్టాక్ మార్కెట్లో లిస్టుకానున్నాయి.
మార్కెట్ నుంచి రూ. 130 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ కు వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 40 శాతం, క్యూఐబీ(QIB)ల కోసం 30 శాతం, ఎన్ఐఐ ల కోసం 30 శాతం షేర్లను కేటాయించారు.
గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేర్ ధర 70 రూపాయలు. ఒక లాట్(LOT) లో 211 షేర్లు ఉన్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చిన్న ఈక్విటీ కావడంతో పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది.
మూడు రోజుల్లో కలిపి మొత్తం 316.64 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 432.71 రెట్లు, ఎన్ఐఐ(NII) కోటా 473.1 రెట్లు, రిటైల్(Retail) కోటా 164.48 రెట్లు సబ్స్క్రయిబ్ కావడం గమనార్హం. ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ శుక్రవారం రాత్రి వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 12న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టు కానున్నాయి.
Highway Infra : గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అంటే..
హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేర్ 36 రూపాయల ప్రీమియం(Premium)తో ట్రేడ్ అవుతోంది. అంటే ఐపిఓ అలాట్ అయ్యే వారికి లిస్టింగ్ సమయంలో 51 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి