ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Armoor Gold traders cheated | స్వర్ణ వర్తకులకు టోకరా.. అర కిలో బంగారం తీసుకుని...

    Armoor Gold traders cheated | స్వర్ణ వర్తకులకు టోకరా.. అర కిలో బంగారం తీసుకుని పారిపోయిన బెంగాలీ వర్కర్​

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: నిజామాబాద్ (Nizamabad)​ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్​ (Armoor)లో బంగారం వర్తకులకు పెద్ద మొత్తంలో టోకరా ఇచ్చాడో పశ్చిమ బెంగాల్​ వర్కర్ (West Bengal Worker)​. అరకిలోకు పైగా గోల్డ్ ఎత్తుకుని పారిపోయాడు. దీంతో బాధిత వ్యాపారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

    Armoor Gold traders cheated : వివరాలోకి వెళితే..

    పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఆర్మూర్ ప్రాంతంలోని గోల్డ్ (Gold) షాప్​లలో బంగారు నగలకు తుది మెరుగులు (gold jewelry finishing) దిద్దేవాడు. భూపాల్​కు పది మంది గోల్డ్ షాప్ యజమానులు సుమారు అరకిలో బంగారు నగలను తుది మెరుగులు దిద్దడానికి ఇచ్చారు.

    అదే అదునుగా భావించిన భూపాల్ అరకిలో బంగారు నగలను తీసుకుని బుధవారం (ఆగస్టు 6) రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఎనిమిది ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్మూర్ ప్రాంతానికి భూపాల్ కుటుంబ సమేతంగా వచ్చాడు. ఆర్మూర్​లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

    READ ALSO  Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    Armoor Gold traders cheated : నమ్మించి నట్టేట ముంచి..

    Armoor Gold traders cheated | స్వర్ణ <yoastmark class=

    అప్పటి నుంచి బంగారు నగలకు తుదిమెరుగులు దిద్దుతూ జీవనం సాగిస్తున్నాడు. నమ్మకంగా ఉంటూ రావడంతో తాజాగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సుమారు 10 మంది గోల్డ్ షాప్ యజమానులు నగల తుదిమెరుగుల కోసం సుమారు అర కిలోకు పైగా బంగారాన్ని బెంగాలీ వర్కర్ భూపాల్​కు ఇచ్చారు.

    పెద్ద మొత్తంలో బంగారం చూడటంతో భూపాల్​కు వక్రబుద్ధి పుట్టింది. ఇంకేం ఆ మొత్తం బంగారాన్ని తీసుకుని రాత్రికి రాత్రే కుటుంబంతో సహా బెంగాల్​కు పారిపోయాడు. గోల్డ్ వర్తకులతోపాటు భూపాల్​ ఇంటి యజమాని 3 తులాల బంగారం ఇచ్చి మోసపోయినట్లు తెలిసింది.

    పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రానికి చెందిన బంగారు నగల తుది మెరుగులు దిద్ది వర్కర్​ చేతిలో మోసపోయిన ఆర్మూర్ ప్రాంతానికి చెందిన గోల్డ్ షాప్ దుకాణదారులు గురువారం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎలాగైనా భూపాల్​ను పట్టుకుని బంగారం అప్పగించాలని విన్నవించినట్లు తెలిసింది.

    READ ALSO  Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    Latest articles

    Viral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | దేశంలో వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కుండపోత...

    Collector Nizamabad | డొంకేశ్వర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల...

    Manchu Lakshmi | మంచు ల‌క్ష్మిని ఆట ప‌ట్టించిన బ‌న్నీ కూతురు.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన క్యూట్...

    YS Sunitha | న్యాయం కోసం పోరాడాలి అన్నా సెక్యూరిటీ త‌ప్ప‌నిస‌రి అయింది.. వైఎస్ సునీత కామెంట్స్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Sunitha | కడప జిల్లా(Kadapa District) పులివెందులలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న...

    More like this