అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom Cooperative Society) వద్ద జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
చేనేత సంఘ అధ్యక్షుడు మధు కృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. చేనేత సంఘం సభ్యులు, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం (Agricultural sector) తర్వాత రెండో పెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ అని అన్నారు. అయినప్పటికీ చేనేత రంగం ప్రస్తుతం ఒడిదొడుకులు ఎదుర్కొంటుందన్నారు.
కార్యక్రమంలో చేనేత సంఘం సభ్యులు లోక మనోహర్, వెంకటరమణ, చుక్కల తీర్థం శ్రీనివాస్, శంకర్ గుర్రపు నారాయణ, గోపాల్, హన్మాండ్లు, బాలకృష్ణ, కృష్ణ, గణేశ్, గూడ నర్సింలు, వెంకటేష్, రోహన్, శ్రీకాంత్, సత్యనారాయణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.