ePaper
More
    HomeజాతీయంCloud Burst | ఉత్త‌రాఖండ్ వ‌రద‌ల‌పై అనుమానాలు.. క్లౌడ్ బరస్ట్ కాదేమోన‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్న...

    Cloud Burst | ఉత్త‌రాఖండ్ వ‌రద‌ల‌పై అనుమానాలు.. క్లౌడ్ బరస్ట్ కాదేమోన‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్న శాస్త్ర‌వేత్తలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cloud Burst | ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో వ‌చ్చిన వరదలు తీవ్ర విషాదానికి దారితీశాయి. ఈ వరదల్లో ధరాలీ (Dharali) అనే గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రాథమికంగా ఇది ఖీర్‌గంగా నదిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా జరిగిందని భావించినా, తాజా సమాచారం ప్రకారం ఇది క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కాదనే అనుమానాలు ఊపందుకుంటున్నాయి.

    ఇండియన్ మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ప్రకారం ఉత్తరకాశీలో కేవలం 27 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది క్లౌడ్ బరస్ట్‌గా పరిగణించదగిన స్థాయి కాదు. ఒక గంటలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడితేనే క్లౌడ్ బరస్ట్ అని అర్థం చేసుకోవాలని ఐఎండీ శాస్త్రవేత్త రోహిత్ తప్లియాల్(IMD Scientist Rohit Tapliyal) స్పష్టం చేశారు.

    READ ALSO  Staff Suspend | ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ఏడుగురు సిబ్బందిపై వేటు

    Cloud Burst | అనుమానాలు..

    అంత తక్కువ వర్షంతో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేకపోయామని తెలిపారు. ఈ పరిస్థితులపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వరదల వెనుక ఉన్న మరో కారణంగా బురద ప్రవాహాలు, మంచు కరుగుదల, మరియు నదీ ప్రవాహ మార్గాల ఆకృతి అంశాలను ప్రస్తావించారు వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ శాస్త్రవేత్త డీపీ డోబాల్ (Former scientist DP Doval). ఎత్తయిన ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు కలిసి నీటిలోకి చేరినప్పుడు కూడా ఒక్కసారిగా భారీ వరదలు రావచ్చని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పష్టత రావాలంటే శాటిలైట్ ఫోటోలు (Satellite Photos), వీడియో విశ్లేషణ అవసరం అని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఇస్రో ISRO సహాయం కోరామని వెల్లడించారు.

    READ ALSO  Shashi Tharoor | రాహుల్ ప్ర‌శ్న‌లు తీవ్ర‌మైన‌వే.. ఈసీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న‌ శ‌శిథరూర్

    ధరాలీ గ్రామంలో వరదల ధాటికి ఇళ్లు, హోటళ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 11 మంది సైనికులతో సహా పలువురు గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేవలం రెండు మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు. చాలా మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ వరదలు నిజంగా క్లౌడ్ బరస్ట్ వల్ల జరిగాయా? లేక మంచు కరిగే ప్రక్రియ, భూపరివర్తనల కారణమా? అనే ప్రశ్నలకు ఇంకా ఖచ్చితమైన సమాధానం రాలేదు. నిపుణులు, శాస్త్రవేత్తలు సమగ్ర అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఉత్తరాఖండ్‌ వరదలు (Uttarakhand Floods) మరొకసారి ప్ర‌కృతి విష‌యంలో మ‌నం తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలను గుర్తు చేశాయి.

    READ ALSO  Donald Trump | భార‌త్‌తో వాణిజ్య చ‌ర్చ‌లుండ‌వ్‌.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌ట‌న‌

    Latest articles

    Jersey auction | జెర్సీ వేలం.. వామ్మో ఆటగాడి జెర్సీకి రికార్డు ధ‌ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jersey auction | ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు కీల‌క మ‌లుపు అనే...

    Bathroom Tips | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ 10 టిప్స్ మీకోసమే

    అక్షరటుడే, హైదరాబాద్: Bathroom Tips | ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ నుండి వచ్చే దుర్వాసన చాలా...

    Today Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప్ర‌స్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల...

    Siraj Rakhi Celebration | రూమ‌ర్ల‌కి చెక్.. మహ్మద్ సిరాజ్‌కు ఆశా భోస్లే మనవరాలు రాఖీ కట్ట‌డంతో వ‌చ్చిన క్లారిటీ..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Siraj Rakhi Celebration | టీమిండియా (Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు (Hyderabad...

    More like this

    Jersey auction | జెర్సీ వేలం.. వామ్మో ఆటగాడి జెర్సీకి రికార్డు ధ‌ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jersey auction | ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు కీల‌క మ‌లుపు అనే...

    Bathroom Tips | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ 10 టిప్స్ మీకోసమే

    అక్షరటుడే, హైదరాబాద్: Bathroom Tips | ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ నుండి వచ్చే దుర్వాసన చాలా...

    Today Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప్ర‌స్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల...