ePaper
More
    HomeజాతీయంVice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    Vice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది. ఉప రాష్ట్రపతి(Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

    నోటిఫికేషన్​ విడుదలతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఆగస్టు 21వ తేదీలోగా నామినేషన్ల దాఖలు చేయాల్సి ఉంటుంది. దాఖలైన నామినేషన్లను ఆగస్టు 22న పరిశీలిస్తారు. ఆగస్టు 25 చివరి తేదీగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. సెప్టెంబరు 9న పోలింగ్​ ఉంటుంది. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ వెంటనే కౌంటింగ్ చేపట్టి, విజేతను ప్రకటిస్తారు.

    Vice President Election | మొత్తం ఓట్లు 782

    జగదీప్​ ధన్​ఖడ్ ​(Jagdeep Dhankhar) గత నెల 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఎన్నికల సంఘం ఎన్నిక నోటిఫికేషన్​​ విడుదల చేసింది. రాజ్యసభ, లోక్​సభ ఎంపీలు కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

    READ ALSO  Heavy Rain | ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం

    లోక్​సభలో (Loksabha) మొత్తం సీట్లు 543 కాగా.. ప్రస్తుతం ఒక సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో (Rajya Sabha) 245 స్థానాలకు గాను ఐదు ఖాళీగా ఉన్నాయి. రెండు సభల్లో కలిపి ప్రస్తుతం 782 మంది ఉన్నారు.

    ఎన్నికల్లో గెలవాలంటే 392 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. కాగా, అధికార ఎన్​డీఏ కూటమికి 422 మంది ఎంపీల బలం ఉంది. దీంతో ఎన్నిక లాంఛనం కానుంది. అయితే విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెడతాయా.. ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తాయా.. అనేది తెలియాల్సి ఉంది.

    Vice President Election | ఇక జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ విషయానికి వస్తే..

    ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ దేశ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపారు. అనూహ్యంగా త‌న ప‌ద‌వి నుంచి వైదొలిగిన ఆయ‌న‌ కొత్త చ‌ర్చ‌కు తెర లేపారు. వివిధ హోదాల్లో ప‌ని చేసిన ధ‌న్‌ఖ‌డ్ (Jagdeep Dhankhad) ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

    READ ALSO  Rahul Gandhi | ఎన్నికల సంఘంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు... బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణ

    ఏడు ప‌దుల వ‌య‌స్సులోనూ నిక్క‌చ్చిగా, నిజాయ‌తీగా వ్య‌వ‌హ‌రించారు. ఉప రాష్ట్ర‌ప‌తిగా మూడేళ్ల ప‌ద‌వీకాలంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఏ పార్టీ అయినా త‌ప్పును త‌ప్పుగానే ఎత్తిచూపారు. ఒకానొక ద‌శ‌లో కేంద్రంతో విభేదించారు.

    అలాగే, విప‌క్ష పార్టీల‌ను సైతం ఆయ‌న తూర్పార‌బట్టారు. ఇక‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌తోనూ త‌ల‌ప‌డ్డారు. మ‌రో రెండేళ్ల ప‌ద‌వీకాలం ఉండ‌గానే అనూహ్యంగా త‌ప్పుకోవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఆయ‌న స్థానంలో ఎవ‌రు వ‌స్తార‌న్న దానిపై ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ హ‌రివంశ్‌ (Rajya Sabha Deputy Chairman Harivansh)కు అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న ప్ర‌చారం ఇప్పటికే ప్రారంభ‌మైంది.

    Latest articles

    Political Rakhi | రాఖీకి ఆ కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం....

    GHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GHMC : హైదరాబాద్​లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో...

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...

    BJP | ఈసీ మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయ్.. రాహుల్ గాంధీకి బీజేపీ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | ఎన్నికల సంఘంపై ప్రత్యక్ష దాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...

    More like this

    Political Rakhi | రాఖీకి ఆ కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం....

    GHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GHMC : హైదరాబాద్​లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో...

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...