అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Tax | ఎలక్ట్రిక్ వాహనదారులకు మహారాష్ట్ర maharashtra ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల Electric vehiclesకు ఇక టోల్ఛార్జీలు toll charges వసూలు చేయమని ప్రకటించింది. ఎలక్ట్రిక్ కార్లు, బస్సులకు టోల్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. ముంబయి – పూణె ఎక్స్ప్రెస్ వే, ముంబయి–నాగ్పూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్ వే, అటల్ సేతు మార్గాల్లో ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఛార్జీలు ఉండవని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో సైతం ఎలక్ట్రిక్ వాహనాలకు 50శాతం టోల్ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ Devendra Fadnavees ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగి కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
