ePaper
More
    Homeబిజినెస్​Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో సాగుతున్నాయి. భారత్‌పై యూఎస్‌ విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) మాత్రం నెగెటివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Gifty nifty | యూఎస్‌ మార్కెట్లు..

    యూఎస్‌ జాబ్‌ డాటా నెగెటివ్‌గా రావడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు పయనిస్తున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయన్న మిన్నెపోలిస్‌ ఫెడ్‌ అధ్యక్షుడు నీల్‌ కష్కరి మాటలతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ బలపడిరది. దీంతో బుధవారం నాస్‌డాక్‌ 1.21 శాతం, ఎస్‌అండ్‌పీ 0.73 శాతం పెరగ్గా.. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.17 శాతం లాభంతో కొనసాగుతోంది.

    READ ALSO  Today Gold Price | ఆల్‌టైం గరిష్టానికి చేరువలో బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    Gifty nifty | యూరోప్‌ మార్కెట్లు..

    డీఏఎక్స్‌ 0.33 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.24 శాతం, సీఏసీ 0.18 శాతం లాభాలతో ముగిశాయి.

    Gifty nifty | ఆసియా మార్కెట్లు..

    ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 2.28 శాతం, నిక్కీ(Nikkei) 0.77 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.64 శాతం, కోస్పీ 0.47 శాతం లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ 0.51 శాతం, షాంఘై 0.28 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.. గిఫ్ట్‌ నిఫ్టీ 0.26 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Gifty nifty | గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా 13వ Trading సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. అయితే స్వల్పంగానే అమ్మారు. నికరంగా రూ. 4,999 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు మన మార్కెట్లపై నమ్మకంతో అగ్రెసివ్‌గా కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. వరుసగా 23వ Trading సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 6,794 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.83 నుంచి 0.74కి తగ్గింది. విక్స్‌(VIX) 2.11 శాతం పెరిగి 11.96 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.90 శాతం తగ్గి 67.49 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 87.73 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.25 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.21 వద్ద కొనసాగుతున్నాయి.
    • రష్యానుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా 25 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
    READ ALSO  Today Gold Price | అంత‌కంతకు పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. నేడు ఎంతంటే..!

    Latest articles

    Political Rakhi | రాఖీకి ఆ కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం....

    GHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GHMC : హైదరాబాద్​లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో...

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...

    BJP | ఈసీ మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయ్.. రాహుల్ గాంధీకి బీజేపీ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | ఎన్నికల సంఘంపై ప్రత్యక్ష దాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...

    More like this

    Political Rakhi | రాఖీకి ఆ కేటీఆర్​, జగన్​ దూరం.. తెగిన బంధం..!

    అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం....

    GHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GHMC : హైదరాబాద్​లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో...

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...