ePaper
More
    HomeతెలంగాణTeacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    Teacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Teacher Promotions | రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల టీచర్ల ప్రమోషన్లకు (teacher promotions) ఎట్టకేలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు (Education department officials) ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

    స్కూల్​ అసిస్టెంట్లకు గెజిటెడ్​ హెచ్​ఎంలుగా, ఎస్టీటీలకు పీఎస్​ హెచ్​ఎం, స్కూల్​ అసిస్టెంట్లుగా ప్రమోషన్​ కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీనియారిటీ జాబితా విడుదల చేసిన అధికారులు సర్టిఫికెట్లు కూడా పరిశీలించారు. షెడ్యూల్​ ప్రకారం బుధవారం హెచ్​ఎంల పదోన్నతుల (HM promotions) కోసం ఆప్షన్​లు ఇవ్వాల్సి ఉంది.

    అయితే సీనియారిటీ జాబితాలో అన్యాయం జరిగిందని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్​పై విచారించిన హైకోర్టు (High Court) ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు 11 వరకు నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆప్షన్ల ప్రక్రియ కొనసాగదని నిజామాబాద్​ డీఈవో అశోక్ (Nizamabad DEO Ashok) తెలిపారు. సీనియారిటీ లిస్టులో తప్పిదాలను సరి చేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

    READ ALSO  South Campus | తెయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

    నిజామాబాద్​ జిల్లాలో (Nizamabad district) 52 హెచ్​ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో లోకల్ బాడీ పాఠశాలలు 42, ప్రభుత్వ పాఠశాలలు 10 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి వీటిని భర్తీ చేయనున్నారు.

    Latest articles

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    Bheemgal | ప్రొటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో...

    National Handloom Day | చేనేతరంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    Handloom Workers Day | ఘనంగా జాతీయ చేనేత కార్మిక దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

    More like this