ePaper
More
    HomeతెలంగాణGuvvala Balaraju | ప్రతిపక్ష పాత్రలో బీఆర్‌ ఎస్‌ విఫలం.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

    Guvvala Balaraju | ప్రతిపక్ష పాత్రలో బీఆర్‌ ఎస్‌ విఫలం.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Guvvala Balaraju | నాగర్‌ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former Nagarkurnool MLA Guvvala Balaraju) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బీఆర్‌ఎస్ ను వీడిన ఆయన గులాబీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన నాగర్ కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. మొయినాబాద్ ఫామ్‌ హౌస్‌(Moinabad farmhouse)లో తాను రూ.100 కోట్లకు అమ్ముడుపోలేదన్న ఆయన.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడకూడదంటే చేసినదంతా ఒప్పుకోవాలని హెచ్చరించారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్‌ఎస్ విఫలమైందని ఆరోపించారు.

    Guvvala Balaraju | బీఆర్‌ఎస్‌ కుట్రతోనే ఓటమి..

    బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS party) దుస్థితికి అసమర్థ నాయకత్వమే కారణమని గువ్వల అన్నారు. అసమర్థ నాయకత్వం కుట్రలు చేసి నాగర్‌ కర్నూలులో (Nagarkurnool) తనను ఓడిచిందంటూ పరోక్షంగా కేటీఆర్‌ పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందన్నారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రను ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పోషించడం లేదన్నారు. ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అది చేయకుండా, అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయని విమర్శించారు. పార్టీ మనుగడ కార్యకర్తలతోనేనని, కార్యకర్తలకు కష్ట కాలంలో పార్టీ అధి నాయకత్వం అండగా ఉండాలని హితవు పలికారు.

    READ ALSO  Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    Guvvala Balaraju | నోరు తెరిస్తే సంచలనమే..

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కానని, పాత్రధారినేనని ఇటీవల స్పష్టం చేసిన గువ్వల మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో తాను రూ.100 కోట్లకు అమ్ముడు పోలేదని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. గువ్వల బాలరాజు అంటేనే ఒక సెన్సేషన్.. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదంటే వాస్తవాలేమిటో ఒప్పుకోవాలని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS party leader KCR) ఏం ఆదేశిస్తే అదే తాను చేశానని చెప్పుకొచ్చారు.

    Guvvala Balaraju | జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం

    బీఆర్‌ఎస్‌(BRS)ను వీడిన తనను పార్టీలో చేరాలని కాంగ్రెస్‌, బీజేపీ ఆహ్వానించాయని మాజీ ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల (BJP and Congress Partys) అది నాయకత్వం నుంచి పిలుపు వచ్చిందన్న ఆయన పేదరిక నిర్మూలన తన లక్ష్యమన్నారు. అయితే, ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన వాయిస్ ప్రజల పక్షాన బతికి ఉండాలంటే.. స్వేచ్ఛ ఉన్న పార్టీ తనకు కావాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తన నిర్ణయం ఏమిటో వెల్లడిస్తానని, నియోజకవర్గ ప్రజలు తన నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

    READ ALSO  Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    Latest articles

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    Bheemgal | ప్రొటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో...

    National Handloom Day | చేనేతరంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    Handloom Workers Day | ఘనంగా జాతీయ చేనేత కార్మిక దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

    More like this

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    Bheemgal | ప్రొటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో...

    National Handloom Day | చేనేతరంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...