ePaper
More
    HomeసినిమాGHAATI Trailer | ఘాటీలంటే గ‌తి లేనోళ్లు కాదు.. అద్దిరిపోయిన అనుష్క ‘ఘాటి’ ట్రైల‌ర్

    GHAATI Trailer | ఘాటీలంటే గ‌తి లేనోళ్లు కాదు.. అద్దిరిపోయిన అనుష్క ‘ఘాటి’ ట్రైల‌ర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: GHAATI Trailer | ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన అనుష్క (Anushka) ఈ మ‌ధ్య సినిమాలు కాస్త త‌గ్గించింది. అయితే ఆమె ప్ర‌స్తుతం క్రిష్ జాగ‌ర్ల‌మూడి (Krish Jagarlamudi) ద‌ర్శ‌క‌త్వంలో ‘ఘాటి’ అనే చిత్రం చేస్తోంది. మోస్ట్ అవైటెడ్ సినిమాగా (most awaited film) రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లింప్స్‌ చూసి, రా, రస్టిక్, ఎమోషనల్ జర్నీ సినిమా చూడ‌బోతున్నామ‌ని ప్రేక్షకుల్లో స్పష్టత వచ్చింది. ఇందులో అనుష్క ఇంటెన్స్ లుక్స్ చూస్తే నోరెళ్ల‌పెట్ట‌క‌ మాన‌రు. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

    GHAATI Trailer | ట్రైల‌ర్ అదుర్స్..

    తాజాగా చిత్ర యూనిట్​ ట్రైల‌ర్​ను రిలీజ్ చేసింది. ఇందులో అనుష్క ప‌వర్ ఫుల్ లుక్‌లో అద‌ర‌గొట్టింది. యాక్ష‌న్ సీన్స్‌లో అయితే పీక్స్ అనే చెప్పాలి. బాహుబ‌లి (Baahubali Movie) త‌ర్వాత అనుష్క మ‌రోసారి ఇలాంటి పాత్ర‌లో క‌నిపిస్తుండ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ట్రైల‌ర్‌లోని ప్ర‌తి సీన్ ఆక‌ట్టుకునేలా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా అద‌ర‌గొట్టేశారు. ఈ సినిమాతో అనుష్క మంచి హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. అనుష్క శెట్టి (Anushka Shetty), దర్శకుడు క్రిష్ కాంబోలో ‘వేదం’ (Vedam Movie) అనే సూప‌ర్ హిట్ మూవీ తెర‌కెక్క‌గా, ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఘాటి.

    READ ALSO  National Awards | 71వ నేష‌న‌ల్ అవార్డ్స్.. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్‌ కేసరి”.. హనుమాన్, బలగం సినిమాలకు కూడా అవార్డులు

    అనుష్క యూవీ క్రియేషన్స్‌తో (Uv Creations) కలిసి పని చేయడం ఇది నాలుగో సారి. ఈ సినిమాకు  ఇది మరో విశేషం. చిత్రానికి మనోజ్ రెడ్డి కాటసాని అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం సమకూర్చారు. సాయిమాధవ్ బుర్రా పదునైన సంభాషణలు రాశారు. విక్రమ్ ప్రభు మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే అనుష్క చాలా డెప్త్ ఉన్న పాత్ర పోషిస్తుంద‌ని అర్ధ‌మ‌వుతోంది. అనుష్క క్రేజ్, క్రిష్ కథన శైలితో ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయం. ఇక ఈ మూవీని సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this