- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిBear | గండి మాసానిపేట్ శివారులో ఎలుగుబంటి కలకలం

Bear | గండి మాసానిపేట్ శివారులో ఎలుగుబంటి కలకలం

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bear | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసానిపేట్​లో (Gandi Masanipet) ఎలుగుబండి కలకలం సృష్టిస్తోంది. వారం రోజులుగా ఎలుగుబంటి ఈ ప్రాంతంలో సంచరిస్తోందని గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎలుగుబంటి తన పిల్లతో కలిసి పొలాల్లోకి వస్తుందని దాంతో పొలం పనులకు వెళ్లేందుకు భయపడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయమై అటవీశాఖ (Forest Department), పోలీస్ (Police department) అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

Bear | ఎలుగుబంటిని అడవిలోకి పంపిస్తాం..

వారం క్రితం కనిపించిన ఎలుగుబంటి.. మంగళవారం రాత్రి మళ్లీ రైతులకు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. ఎలుగుబంటిని అటవీ ప్రాంతాల్లోకి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎలుగుబంటి కారణంగా తాము పొలాల్లోకి వెళ్లలేకపోతున్నామని.. దీంతో పనులు చేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News