ePaper
More
    Homeబిజినెస్​IPO Listing | లాభాలను అందించిన లోటస్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌.. ఫ్లాట్‌గా ప్రారంభమైన ఎంబీ ఇంజినీరింగ్‌

    IPO Listing | లాభాలను అందించిన లోటస్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌.. ఫ్లాట్‌గా ప్రారంభమైన ఎంబీ ఇంజినీరింగ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO Listing | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో (Domestic stock market) బుధవారం మెయిన్‌ బోర్డ్‌కు చెందిన మూడు కంపెనీలు లిస్టయ్యాయి. శ్రీలోటస్‌ డెవలపర్‌ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించగా.. ఎన్‌ఎస్‌డీఎస్‌ సైతం పరవాలేదనిపించింది. ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌ మాత్రం ఫ్లాట్‌గా ప్రారంభమైంది.

    IPO Listing | శ్రీ లోటస్‌ డెవలపర్‌..

    నివాస, వాణిజ్య ప్రాంగణాలను నిర్మించడంలో పేరున్న ముంబయికి చెందిన శ్రీ లోటస్‌ డెవలపర్‌(Sri Lotus Developers) కంపెనీ ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ. 792 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో(IPO)కు వచ్చింది. కంపెనీ షేర్లు బుధవారం లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 150 కాగా 18.67 శాతం ప్రీమియంతో రూ. 178 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి తొలిరోజే ఒక్కో షేరుపై రూ. 28, లాట్‌(వంద షేర్లు)పై రూ. 2,800 లాభం(Profit) వచ్చిందన్న మాట. లిస్టింగ్‌ తర్వాత షేరు ధర మరింత పెరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రూ. 187 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

    IPO Listing | ఎన్‌ఎస్‌డీఎల్‌..

    ఐపీవో ద్వారా ఎన్‌ఎస్‌డీఎల్‌ (NSDL) కంపెనీ రూ. 4,011.60 కోట్లు సమీకరించింది. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు (Equity share) ధర రూ. 800 కాగా పది శాతం ప్రీమియంతో రూ. 880 వద్ద ట్రేడిరగ్‌ ప్రారంభించాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ. 80, లాట్‌(18 షేర్లు)పై రూ. 1,440 లాభం వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రూ. 910 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

    IPO Listing | ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌..

    రూ. 650 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌ (M&B Engineering) ఐపీవోకు వచ్చింది. కంపెనీ షేర్లు బుధవారం లిస్ట్‌ అయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర గరిష్ట ప్రైస్‌ బాండ్‌ (Upper price band) వద్ద రూ. 385 కాగా అదే ధర వద్ద ప్రస్థానాన్ని ప్రారంభించాయి. లిస్టి అయ్యాక షేరు ధర కాస్త పెరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 4 శాతం లాభంతో రూ. 400 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

    Latest articles

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    More like this