ePaper
More
    HomeజాతీయంInter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు కూతురు కళ్ల ముందే తండ్రి అల్లుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దర్భంగా మెడికల్ కాలేజీ(Darbhanga Medical College)లో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్నూ ప్రియ, అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు(Castes Separate) కావడంతో పెద్దలు ఒప్పుకోరని భావించిన వీరు, కుటుంబ అనుమతి లేకుండానే కొద్ది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వారు తాము చదువుకుంటున్న కాలేజీ హాస్టళ్లలోనే ఉంటున్నారు.

    Inter Caste Marriage | ఎంత దారుణం..

    ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ప్రియ తండ్రి ప్రేమ్‌ శంకర్ ఝా తీవ్ర కోపంతో రగిలిపోయాడు. తన కుటుంబ పరువు నాశనమైందని భావించి, తన వద్ద ఉన్న లైసెన్స్‌ గన్‌(Licensed Gun)తో కాలేజీకి వెళ్లి, తన కూతురు కళ్ల ముందే రాహుల్‌పై కాల్పులు జరిపాడు. ఛాతిలో బుల్లెట్‌ తగలడంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు ప్రియ తండ్రిని అడ్డుకున్నారు. రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాని అప్ప‌టికే అత‌ను చ‌నిపోయిన‌ట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రేమ్ శంకర్‌ ఝా‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

    ఈ ఘటనపై బాధిత యువతి ప్రియ స్పందిస్తూ, “నా తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడన్న విషయం నమ్మలేకపోతున్నాను. మా పెళ్లి సమయంలో మా కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని భావించి పోలీసులను ఆశ్రయించాం. అయినా కూడా రక్షణ లభించలేదు. ఇది కేవలం నా తండ్రి చేసిన పని కాదు, మా కుటుంబం మొత్తం కుట్రలో భాగమైంది” అని వాపోయింది.ఈ ఘటనపై కాలేజీ విద్యార్థులు(College Students) పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రియ తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్​ను కాల్చిన అనంతరం కాలేజీ విద్యార్థులు ప్రేమ్​ శంకర్​పై దాడి చేశారు. గాయాల బారిన ప‌డ్డ‌ అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ జ‌గ‌న్నాథ్ రెడ్డి(SP Jagannath Reddy) తెలిపారు.

    Latest articles

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు కొనేవారు ఏం చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండటం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    More like this