- Advertisement -
HomeUncategorizedCM Chandra Babu | చేనేత కార్మికుల‌కి చంద్ర‌బాబు వ‌రాలు...జీఎస్టీ మాఫీ, ఉచిత విద్యుత్, త్రిఫ్ట్...

CM Chandra Babu | చేనేత కార్మికుల‌కి చంద్ర‌బాబు వ‌రాలు…జీఎస్టీ మాఫీ, ఉచిత విద్యుత్, త్రిఫ్ట్ ఫండ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandra babu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, రాష్ట్ర చేనేత కార్మికులకు ఊరట కలిగించే చర్యలను ప్రకటించింది. చేనేత వస్త్రాల(Handloom Fabrics)పై విధించే జీఎస్టీ భారాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందనీ, సంబంధిత మొత్తాన్ని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన చేనేత-జౌళిశాఖ సమీక్ష సమావేశంలో, ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు. చేనేత కార్మికుల(Handloom Workers) సంక్షేమం కోసం చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు.

CM Chandra Babu | వ‌రాల జ‌ల్లు..

చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే(State Government) భరించ‌నుంద‌ని తెలిపారు. ఈ నిర్ణయాలను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 7వ తేదీ నుంచి అమలులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి “ఒకే జిల్లా – ఒకే ఉత్పత్తి” విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఏపీ చేనేత ఉత్పత్తులు 10 జాతీయ అవార్డులను(10 National Awards) సొంతం చేసుకున్నాయని తెలిపారు. ఈ విజయానికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. వ్యవసాయం త‌ర్వాత రాష్ట్రంలో అత్యంత కీలక రంగంగా చేనేతను పేర్కొన్నారు.

- Advertisement -

ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో తనను కలిసిన చేనేత కుటుంబాలు చెప్పిన సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయాలను తీసుకున్నట్టు తెలిపారు.చేనేత అనేది పురాతనమైన, సాంప్రదాయపూరితమైన కుటీర పరిశ్రమ. ఈ రంగంలో అనేక కులాలవారు జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా పద్మశాలీ(Padmashali), పట్టుశాలి, దేవాంగ, నేతకాని, కైకాల, భవసార క్షత్రియ, ముదలియార్, నీలి, సెంగుందం వంటివారు చేనేతతో మమేకమైన వృత్తి కుటుంబాలుగా గుర్తించబడతారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే..చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే ఎక్కువ క‌రెంట్‌ వినియోగించినట్లైతే 200 యూనిట్ల వరకు బిల్లును సర్కార్ భరిస్తుంది. అదనంగా వినియోగించిన క‌రెంట్ మాత్రం వినియోగదారులే చెల్లించాలి. పవర్‌లూమ్స్‌కూ 500 యూనిట్లు దాటితే ఇదే నిబంధన వర్తిస్తుందిని తెలిపారు. ఇక చేనేత కార్మికులను ఆదుకునేందుకు పింఛన్​ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. ప్రారంభంలో రూ.200 ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక హామీ మేర‌కు రూ.4000లు ఇస్తోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News