అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. ‘భారత్ గౌరవ్’ (Bharat Gaurav) పేరుతో ప్రత్యేక రైలును తీసుకొస్తోంది.
ఈ నెల16న సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. తొమ్మిది రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
ప్రయాణంలో మహాకాళేశ్వర్, త్రయంబకేశ్వర్, ఓంకారేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్ ఆలయాల దర్శనం కల్పిస్తారు. అంటే పంచ జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుందన్నమాట.
Jyotirlinga Yatra : ప్రయాణ మార్గం..
సికింద్రాబాద్(Secunderabad) నుంచి ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణా మీదుగా ఉజ్జయినీ వెళ్తుంది.
ప్యాకేజీలో యాత్రికులకు వసతి, భోజనం వంటి వాటితోపాటు ఆలయాల దర్శనం ఉంటుంది.
Jyotirlinga Yatra : టికెట్ల ధరలు ఇలా(ఒక్కరికి)..
- స్లీపర్ రూ. 14,700
- 3 ఏసీ రూ. 22,900
- 2 ఏసీ రూ. 29,900
Jyotirlinga Yatra : కల్పించే సౌకర్యాలు..
- రోజుకు మూడు సార్లు భోజనం
- వసతి
- పర్యాటక రవాణా సౌకర్యాలు
- ప్రతి బోగీలో ఐఆర్సీటీసి సిబ్బంది అందుబాటులో ఉంటారు.
Jyotirlinga Yatra : కాంటాక్ట్ కావాలంటే..
- వెబ్ సైట్: www.irctctourism.com,
- ఫోన్ నంబర్లు.. : 97013 60701, 92810 30740, 92810 30750, 92810 30711