ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చిత(Uncertainty) పరిస్థితులతో గ్లోబల్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌్‌గా ఉన్నాయి. మంగళవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి.

    బుధవారం ఉదయం నుంచి ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం నెగెటివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ట్రంప్‌ టారిఫ్‌(Trump tariffs)ల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం వాల్‌స్ట్రీట్‌ నష్టపోయింది. మంగళవారం నాస్‌డాక్‌(Nasdaq) 0.65 శాతం, ఎస్‌అండ్‌పీ 0.49 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.30 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 0.37 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.16 శాతం మేర పెరిగ్గా.. సీఏసీ 0.14 శాతం నష్టపోయింది.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో నిక్కీ 0.60 శాతం, షాంఘై 0.12 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.58 శాతం, హంగ్‌సెంగ్‌ 0.58 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.16 శాతం, కోస్పీ 0.12 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

    గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.17 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా 12వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. అయితే స్వల్పంగానే అమ్మారు. నికరంగా రూ. 22.48 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐ(DII)లు మన మార్కెట్లపై నమ్మకంతో అగ్రెసివ్‌గా కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. వరుసగా 22వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 3,840 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.94 నుంచి 0.83కి తగ్గింది. విక్స్‌(VIX) 2.13 శాతం తగ్గి 11.71 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.34 శాతం తగ్గి 67.99 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 13 పైసలు బలహీనపడి 87.80 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.22 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.79 వద్ద కొనసాగుతున్నాయి.
    • రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసే దేశాలపై రాబోయే 24 గంటలలో సుంకాలను గణనీయంగా పెంచుతామని యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.
    READ ALSO  Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేట్‌ను స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. అయితే కామెంటరీ ఎలా ఉంటుందోనని మార్కెట్‌ ఎదురుచూస్తోంది. గ్లోబల్‌ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ఈరోజు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...