- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Abhigyan Malviya | ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​ అభిగ్యాన్​ మాల్వియా బాధ్యతల స్వీకరణ

Abhigyan Malviya | ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​ అభిగ్యాన్​ మాల్వియా బాధ్యతల స్వీకరణ

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Abhigyan Malviya | ఆర్మూర్​ సబ్ ​కలెక్టర్​గా అభిగ్యాన్​ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజాగౌడ్ (RDO Rajagoud)​ సబ్​కలెక్టర్​కు బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్​ సబ్​డివిజన్​లోని రెవెన్యూ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సబ్ ​కలెక్టర్​గా అభిగ్యాన్ మాల్వియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్​గా (Armoor Revenue Division) ఏర్పడిన నాటి నుంచి ఆర్డీవో స్థాయిలో రెవెన్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Abhigyan Malviya | 2023 బ్యాచ్​ ఐఏఎస్​..

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్​ అధికారులకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2023 బ్యాచ్​కు చెందిన అభిజ్ఞాన్​ మాల్వియాను ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​గా నియమించింది. ఆర్మూర్ రెవెన్యూ కార్యకలాపాలు ఇకపై సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్నాయి. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్​ (Bodhan), బాన్సువాడకు (banswada) సబ్​ కలెక్టర్లు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News