ePaper
More
    Homeక్రీడలుMohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చాడు. హైదరాబాద్ ముద్దుబిడ్డగా పేరొందిన ఈ యువ బౌలర్ ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్క‌లు చూపించాడు. ఆఖరి టెస్టులో ఐదు కీలక వికెట్లు తీసి జట్టుకు మంచి విజ‌యం అందించాడు. అయితే కేవలం క్రికెటర్‌గానే కాకుండా తెలంగాణ పోలీస్ డిపార్ట్​మెంట్​ డీఎస్పీ హోదాలో సేవలందిస్తున్న సిరాజ్ అంతర్జాతీయస్థాయిలో చూపించిన ఉత్తమ ప్ర‌ద‌ర్శ‌న‌కు పోలీస్ శాఖ(Telangana Police Department) హర్షాతిరేకంతో స్పందించింది. త‌మ అధికారిక సోషల్ మీడియా ద్వారా సిరాజ్‌పై ప్ర‌త్యేక ప్ర‌శంస‌లు కురిపించింది.

    Mohammed Siraj | ఎస్పీగా ప్రమోషన్​ ఇవ్వాలంటున్న ఫాన్స్​

    డీఎస్పీ మహ్మద్ సిరాజ్‌(Mohammed Siraj)కు అభినందనలు. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక టెస్టు గెలుపులో మీ ప్రదర్శన అమోఘం అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. సిరాజ్‌ను ‘తెలంగాణకు గర్వకారణం’ (ప్రైడ్ ఆఫ్ తెలంగాణ) అని కూడా అభివ‌ర్ణించారు. ఇంగ్లండ్ (England) గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని అందించిన సిరాజ్‌ తెలంగాణకు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. సిరాజ్ అసాధారణ ప్రదర్శన చూసిన నెటిజన్లు, అతనికి డీఎస్పీ నుంచి ఎస్పీగా ప్రమోషన్ ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. “డీఎస్పీగా ఈ విజ‌యం సాధించాడు, ఎస్పీ అయితే ఇంకా గొప్ప విజయాలు సాధిస్తాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    READ ALSO  India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

    ప్రస్తుత నిబంధనల ప్రకారం, డీఎస్పీ నుంచి ఎస్పీగా పదోన్నతి పొందాలంటే కనీసం 3-5 ఏళ్ల సర్వీసు అవసరం. అంతేకాదు మెరిట్ ఆధారంగా అదనపు ఎస్పీగా ఎంపికయ్యాకే ఎస్పీ పదవికి అవకాశం ఉంటుంది. కానీ.. సిరాజ్ ఇప్పటి వరకూ డీఎస్పీ బాధ్యతలను స్వీకరించలేదు. ఎందుకంటే అతను ప్రస్తుతం భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత, సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-1 స్థాయి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. సిరాజ్‌కు ఇంటర్మీడియట్ అర్హత మాత్రమే ఉన్నా, ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చి ఈ ఉద్యోగం కేటాయించింది. అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో (Hyderabad Jubilee Hills) 600 గజాల స్థలం కూడా బహుమతిగా ఇచ్చింది. సిరాజ్ ప్రదర్శనపై ప్రజల్లో మక్కువ, గౌరవం ఉన్నా, అతనికి నేరుగా ఎస్పీగా ప్రమోషన్ అవకాశం ఇవ్వ‌డం కుద‌ర‌దు. నిబంధనల ప్రకారం ప్రమోషన్‌కు కావాల్సిన సర్వీస్, మెరిట్, అనుభవం ఇంకా అందుబాటులో లేవు.

    READ ALSO  IND vs ENG Test | వ‌రుస‌గా టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఎంత స్కోరు చేసిందంటే..!

    Latest articles

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rain)...

    Chahal – Dhanashree | చాహల్ – ధనశ్రీ విడాకుల వ్యవహారం.. సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chahal - Dhanashree | టీమిండియా (Team India) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ yuzvendra chahal,...

    Jyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. 'భారత్ గౌరవ్'...

    TTD | టీటీడీ సిబ్బంది ప్రైవేటు కార్యకలాపాలు.. ముగ్గురు సిబ్బందిపై చర్యలు

    అక్షరటుడే, తిరుమల: TTD : నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బందిపై టీటీడీ కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా ముగ్గురు ఉద్యోగులపై చర్యలు...

    More like this

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rain)...

    Chahal – Dhanashree | చాహల్ – ధనశ్రీ విడాకుల వ్యవహారం.. సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chahal - Dhanashree | టీమిండియా (Team India) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ yuzvendra chahal,...

    Jyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. 'భారత్ గౌరవ్'...