Transco Sports
Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుంది..

అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్ ఎన్పీడీసీఎల్ (TS NPDCL) ఓఎంసీ ఎస్ఈ పీవీ రావు, నిజామాబాద్ (Nizamabad) ఎస్ఈ రాపల్లి రవీందర్ అన్నారు.

రెండు రోజులుగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో (Police Parade Ground) కొనసాగుతున్న తెలంగాణ ట్రాన్స్​కో, డిస్కం హాకీ ఛాంపియన్​షిప్ (Transco, DISCOM Hockey Championship)​ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయన్నారు.

ఉద్యోగులకు ఇలాంటి క్రీడా పోటీల వల్ల ఒత్తిడి దూరమవుతుందన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీఈలు రమేష్, శ్రీనివాస్, వెంకట్ రమణ, విక్రమ్​, ఎస్​ఏవో శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏవో గంగారం, సురేష్ కుమార్, శంకర్ నాయక్, స్పోర్ట్స్ సెక్రెటరీ గోపి, ఉత్తమ్​, దినేష్, మూర్తి , సీనయ్య, సతీష్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్​కో అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్​లో విజేతగా వరంగల్ సర్కిల్ గెలుపొందగా.. రన్నర్​గా నిజామాబాద్ సర్కిల్ నిలిచింది. అలాగే తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచింది. టోర్నమెంట్​లో ఎంపైర్లుగా స్వామి, శ్రీకాంత్, హరీష్, గంగాధర్, ఎన్.శ్రీకాంత్​లు వ్యవహరించారు.

రన్నర్​గా నిలిచిన నిజామాబాద్ సర్కిల్ జట్టు