Nitin Gadkari | తప్పనున్న హారన్ల రోత.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Nitin Gadkari | తప్పనున్న హారన్ల రోత.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nitin Gadkari | రోడ్డు ఎక్కామంటే చాలు హారన్ల horons మోతతో చెవులు చిల్లులు పడుతాయి. హైదరాబాద్ hyderabad​ city లాంటి మహానగరాల్లో అయితే హారన్లతో శబ్దకాలుష్యం మాములుగా ఉండదు. ఇతర పట్టణాలు, నగరాల్లో సైతం హారన్​ శబ్ధంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ Nitin Gadkari కీలక ప్రకటన చేశారు.

భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని musical instruments sounds మాత్రమే వాహనాలకు హారన్‌గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్లూట్‌, తబలా, వయెలిన్‌, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల శబ్దాలు ఇక హారన్​గా వినిపించేలా చట్టం తెస్తామన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇలా వాయిద్య పరికరాలతో వచ్చే శబ్దాలను హారన్​గా ఉపయోగిస్తే వినసొంపుగా ఉండటంతో పాటు శబ్ద కాలుష్యం sound pollution కూడా తగ్గనుంది. వాయు కాలుష్యం air pollution తగ్గించడానికి కూడా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. వాయు కాలుష్యం.. రవాణా రంగం వల్లే 40 శాతం జరుగుతోందని ఆయన చెప్పారు. దీనిని తగ్గించడానికి ఎలక్ట్రిక్‌ వాహనాలతో electric vehicles పాటు మిథనాల్, ఇథనాల్‌ వంటి బయో-ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.