ePaper
More
    Homeబిజినెస్​Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపుల నేపథ్యంలో మన మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. బుధవారం ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 72 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో మరో 392 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) ఫ్లాట్‌గా ప్రారంభమై 130 పాయింట్లు కోల్పోయింది. చివరి అరగంటలో మార్కెట్లు కోలుకుని పైకి లేచాయి. చివరికి సెన్సెక్స్‌ 308 పాయింట్ల నష్టంతో 80,710 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,649 వద్ద స్థిరపడ్డాయి.

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,743 కంపెనీలు లాభపడగా 2,299 స్టాక్స్‌ నష్టపోయాయి. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 128 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 101 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 1.70 లక్షల కోట్లు తగ్గింది.

    READ ALSO  Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. ఊగిసలాటలో ప్రధాన సూచీలు

    మిశ్రమంగా సూచీలు..

    బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌(Oil and Gas index) 0.96 శాతం, ఎనర్జీ 0.74 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.61 శాతం, ఐటీ 0.59 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌, రియాలిటీ ఇండెక్స్‌లు 0.52 శాతం, హెల్త్‌కేర్‌ 0.42 శాతం క్షీణించాయి. ఆటో సూచీ 0.38 శాతం, పవర్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, కమోడిటీ 0.27 శాతం, టెలికాం 0.13 శాతం పెరిగాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.27 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.14 శాతం నష్టపోయాయి.

    Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో.. 133 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టైటాన్‌ 2.16 శాతం, మారుతి 1.30 శాతం, ట్రెంట్‌ 1.22 శాతం, ఎయిర్‌టెల్‌ 0.77 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.69 శాతం లాభపడ్డాయి.

    READ ALSO  Stock Market | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

    Top Losers : అదాని పోర్ట్స్‌ 2.38 శాతం, రిలయన్స్‌ 1.40 శాతం, ఇన్ఫోసిస్‌ 1.39 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.19 శాతం, ఎటర్నల్‌ ఒక శాతం నష్టపోయాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....