ePaper
More
    HomeతెలంగాణHarish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం విషయంలో తమపై బురద చల్లడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ నివేదికపై ఆయన మంగళవారం తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) ప్రజెంటేషన్​ ఇచ్చారు. కాళేశ్వరం రిపోర్టు ఒకవైపు చూసి ఇచ్చినట్లు కనబడుతోందన్నారు. ఆ నివేదికలో ఉన్న ఆరోపణలు బేస్​లెస్​ అన్నారు.

    Harish Rao | కమీషన్లు.. కమిషన్ల పాలన

    రాష్ట్రంలో కమీషన్లు.. కమిషన్ల పాలన నడుస్తోందని హరీశ్​రావు (Harish Rao) విమర్శించారు. బిల్లులు చెల్లించడానికి డబ్బులు అడుతున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో నిరసన చేపట్టారని గుర్తు చేశారు. ఓ వైపు డబ్బులు దండుకోవడానికి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం కమిషన్లు వేస్తోందని విమర్శించారు.

    READ ALSO  Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    Harish Rao | పోలవరం కూలితే పట్టించుకోలే..

    గోదావరి నదిపై ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)​ మూడు సార్లు కూలిపోయిందని హరీశ్​రావు అన్నారు. కానీ అక్కడకు ఎన్​డీఎస్​ఏ ఇప్పటి వరకు వెళ్లలేదన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే ఎన్​డీఎస్​ఏ వచ్చి రిపోర్టులు ఇచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చిందని చెప్పారు.

    Harish Rao | స్థానిక ఎన్నికల నేపథ్యంలో..

    రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం (Polavaram Project) రాజకీయ కుట్ర చేస్తోందని హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం కమిషన్​ నివేదిక రిపోర్టును బయట పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికలు ఉండడంతోనే రిపోర్టును బయట పెట్టారని ఆరోపించారు. తమకు కాళేశ్వరం కమిషన్​ నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇచ్చారని విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.

    READ ALSO  Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    Harish Rao | అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం

    కాళేశ్వరం కమిషన్​ నివేదికపై ప్రభుత్వం 60 పేజీల రిపోర్టు బయట పెట్టిందన్నారు. అయితే అది కమిషన్​ నివేదికనా.. లేక ప్రభుత్వం ఏమైనా మార్పులు చేసిందా అని ప్రశ్నించారు. పూర్తి నివేదికను బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. అసెంబ్లీలో చర్చ పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. వాస్తవాలను అసెంబ్లీ వేదికగా (Assembly Stage) ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

    Harish Rao | అది రాజకీయ జోక్యం కాదు

    ప్రాజెక్ట్​లపై రివ్యూ చేయడం ముఖ్యమంత్రి విధి అని హరీశ్​ రావు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్​ ప్రాజెక్ట్​ల నిర్మాణం వేగవంతం చేయాలని నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. కమిషన్​ దీనిని రాజకీయ జోక్యంగా పేర్కొనడం సరికాదన్నారు. అది ముఖ్యమంత్రి బాధ్యత అన్నారు. రాజకీయ దురుద్దేశంలో వేసిన కమిషన్​ నివేదికలు న్యాయస్థానం, ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు.

    READ ALSO  Kaleshwaram Commission | కాళేశ్వ‌రం నివేదికపై ముగిసిన అధ్య‌యనం.. నేడు కేబినెట్‌లో చ‌ర్చించ‌నున్న మంత్రులు

    Harish Rao | తెలంగాణ ప్రదాయని కాళేశ్వరం

    కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వరప్రదాయని అని హరీశ్​ రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్​ తెలంగాణ చరిత్రపుటల్లో, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కాళేశ్వరం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిదని ఆయన అభివర్ణించారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....