అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heroine Hansika | ఇటీవలి కాలంలో సినీ ప్రపంచంలో విభేదాలతో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాకూడా వ్యక్తిగత కారణాలతో సంబంధాలు తెగిపోతున్న ఘటనలు మనం తరచూ చూస్తున్నాం. సమంత-నాగచైతన్య, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య, అమీర్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ వివాహబంధానికి స్వస్తి చెప్పగా, ఇప్పుడు మరో ప్రముఖ నటి హన్సిక మొత్వానీ కూడా అదే దారిలో నడుస్తున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. హన్సిక( Heroine Hansika) తన భర్త సోహైల్ కథూరియాతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Heroine Hansika | ఫొటోలన్నీ డిలీట్..
ఈ ప్రచారాల నడుమ హన్సిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను పూర్తిగా తొలిగించి వేసింది. ఈ చర్యను గమనించిన నెటిజన్లు, అభిమానులు వెంటనే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని భావిస్తూ సోషల్ మీడియా(Social Media)లో చర్చకు తెరలేపారు. త్వరలోనే వారిరివురు విడాకులు తీసుకోవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హన్సిక – సోహైల్ ప్రేమకథ చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. 2022 డిసెంబర్ 4న, రాజస్థాన్‌లోని జైపూర్ కోట(Jaipur Fort)లో వీరి వివాహం సింధీ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ హన్సిక తన పేజ్ నుంచి తొలగించడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితం విషయంలో నిశ్శబ్దం పాటించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
అయితే ఈ విడాకుల ప్రచారం నేపథ్యంలో నిజమైన కారణాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలా? లేక వృత్తిపరమైన ఒత్తిడులా? అనే దానిపై స్పష్టత లేదు. హన్సిక కాని సోహైల్ కాని ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కానీ హన్సిక తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చూస్తే, ఈ వార్తలలో నిజం ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, మరో సెలబ్రిటీ జంట విడిపోయే దిశగా వెళ్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ జంట మళ్లీ ఒక్కటవాలని ఆశిస్తూ ఉన్నారు. త్వరలో హన్సిక లేదా సోహైల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.