Upasana Kamineni
Upasana Kamineni | మెగా కోడ‌లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Upasana Kamineni | మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ‘స్పోర్ట్స్ పాలసీ 2025′(Sports Policy 2025) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను సైతం ప్రారంభించింది. ఈ సంస్థకు ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను ప్రభుత్వం నియమించింది. కో ఛైర్​పర్సన్​గా మెగా కోడలు ఉపాసన కామినేని(Upasana Kamineni)కి బాధ్యతలు అప్పగించింది. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.

Upasana Kamineni | చిరు హ‌ర్షం..

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్‌పర్సన్​గా ఉపాసనను నియమించడంతో ఆమె మామ, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. ఉపాసన కో-ఛైర్‌పర్సన్‌గా నియమితురాలు కావడం తమ కుటుంబానికి గర్వకారణమన్నారు. ‘‘ఈ పదవి గౌరవంతో పాటు, బాధ్యతను కూడా పెంచుతుంది. డియర్ ఉపాసన… నీ నిబద్ధత, క్రీడలపై నీ ఆసక్తి నిన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతున్నాను. యువతలో ఉన్న క్రీడాప్రతిభను వెలికి తీయడంలో, వారిని అగ్రస్థాయికి తీసుకెళ్లే విధానాలను రూపొందించడంలో నీవు కీలకపాత్ర పోషిస్తావని ఆశిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు నీతో ఎల్లప్పుడూ ఉండుగాక ” అని పేర్కొన్నారు.

అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కూడా సంతోషం వ్య‌క్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. తెలంగాణ‌ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్‌పర్సన్(Telangana Sports Hub Co-Chairperson)​గా ఎంపికైన ఉపాసనకు శుభాకాంక్ష‌లు అంటూ రామ్ చ‌రణ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఇందులో బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను ప్ర‌భుత్వం నియ‌మించింది.