ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఒత్తిడికి గురవుతున్నాయి. వాణిజ్య అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు నష్టాలతో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 72 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో మరో 388 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) ఫ్లాట్‌గా ప్రారంభమై 127 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 403 పాయింట్ల నష్టంతో 80,615 వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 24,621 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Markets | ఐటీ సెక్టార్‌లో మళ్లీ ఒత్తిడి..

    గత Trading సెషన్‌లో కోలుకున్నట్లు కనిపించిన ఐటీ సెక్టార్‌ మళ్లీ సెల్లాఫ్‌కు గురవుతోంది. అమెరికా బెదిరింపులతో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌ పడిపోతున్నాయి. బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.02 శాతం, ఐటీ(IT) 0.89 శాతం, ఎనర్జీ, రియాలిటీ 0.86 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.67 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.42 శాతం, ఇన్‌ఫ్రా 0.40 శాతం, హెల్త్‌కేర్‌ 0.37 శాతం నష్టాలతో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.19 శాతం, మెటల్‌, కమోడిటీ ఇండెక్స్‌లు 0.12 శాతం, టెలికాం సూచీ 0..10 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.41 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.34 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.24 శాతం నష్టాలతో ఉన్నాయి.

    READ ALSO  Stock Market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    Stock Markets | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. మారుతి 0.92 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.88 శాతం, ఎయిర్‌టెల్‌ 0.82 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.64 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.58 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

    Stock Markets | Top losers..

    ఇన్ఫోసిస్‌ 1.46 శాతం, బీఈఎల్‌ 1.18 శాతం, రిలయన్స్‌ 1.10 శాతం, అదాని పోర్ట్స్‌ 1.08 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.07 శాతం, నష్టాలతో ఉన్నాయి.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this