అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం కీలక నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీ కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది. పలు కీలక అంశాలపై ఎన్డీఏలోకి పార్టీలు చర్చించనున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు. మొన్నటి వరకు పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Opearation Sindoor) పై చర్చ కోసం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో అనేక సార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై రెండు సభల్లో చర్చ జరిగింది. అనంతరం బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. దీంతో సభ సజావుగా సాగడం లేదు. అంతేగాకుండా కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ప్రధాని మోదీ ఈ సమావేశంలో వీటికి సమాధానం చెప్పనున్నట్లు సమాచారం.
PM Modi | ఉపరాష్ట్రపతి ఎన్నికపై..
జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ రోజు నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీంతో ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖరారుపై సైతం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించనున్నారు.
PM Modi | ప్రధానికి సన్మానం
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీని కేంద్ర మంత్రులు ఘనంగా సన్మానించారు. ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) విజయవంతంగా నిర్వహించడంపై ఆయనను సత్కరించారు. మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలిసింది. ఇందులో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేష్ సిందూర్, ఎన్నికల సంఘంపై ఆరోపణల గురించి మాట్లాడనున్నారు.
PM Modi | ఇండియా కూటమి నిరసనలు
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (INDI Alliance) ఎంపీలు నిరసనకు సిద్ధమయ్యారు. బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇటీవల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సభలో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
PM Modi | నేడు కీలక బిల్లులు
లోక్‌సభలో ప్రభుత్వం మంగళవారం పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ డోపింగ్ నిరోధక చట్టం 2022కు సవరణలను లోక్‌సభలో పరిశీలన మరియు ఆమోదం కోసం ప్రతిపాదిస్తారు. ఆయన జాతీయ క్రీడా పాలన బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రాతిపాదించనున్నారు.