Staff Suspend
Staff Suspend | ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ఏడుగురు సిబ్బందిపై వేటు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Staff Suspend | స్వాతంత్య్ర దినోత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం(Security Failure) బ‌య‌ట ప‌డింది. భ‌ద్ర‌తా సిబ్బంది డ‌మ్మీ బాంబును క‌నిపెట్ట‌లేక పోవ‌డంతో ఏడుగురిపై వేటు ప‌డింది. ఆగ‌స్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్స‌వం(Independence Day) సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఎర్ర‌కోట‌పై మువ్వ‌న్నెల జెండాను ఆవిష్క‌రించి జాతినుద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఈ నేప‌థ్యంలో చారిత్ర‌క ఎర్రకోట(Red Fort) వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే, వేడుకుల‌కు ముందే అక్క‌డ తీవ్ర భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. సెక్యూరిటీ డ్రిల్‌లో భాగంగా స్పెష‌ల్ టీమ్ ఏర్పాటు చేసిన డ‌మ్మీ బాంబును క‌నిపెట్ట‌లేక పోయారు.

Staff Suspend | క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు..

ఎర్రకోటలో జరిగే సాధారణ భద్రతా విన్యాసాల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులను ఉటంకిస్తూ ANI తెలిపింది. భద్రతా విన్యాసాలలో భాగంగా ఎర్రకోట ప్రాంగణంలో ప్రత్యేక సెల్ బృందం డమ్మీ బాంబు(Dummy Bomb)ను అమర్చింది. అయితే, అక్క‌డ భద్రతను ప‌ర్య‌వేక్షిస్తున్న సిబ్బంది బాంబును గుర్తించడంలో విఫలమయ్యారు, దీనితో తక్షణ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

Staff Suspend | ఏడుగురు బంగ్లా దేశీయుల అరెస్టు..

మ‌రోవైపు, విదేశీయులు ఎర్ర‌కోట‌లోకి చొర‌బ‌డేందుకు య‌త్నించిన ఘ‌ట‌న వెలుగు చూసింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎర్రకోటలోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు(Delhi Police) వారిని అరెస్ట్ చేశారు. వారందరూ అక్రమ వలసదారులే. ఢిల్లీలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. వారందరి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంది. పోలీసులు వారినుంచి కొన్ని బంగ్లాదేశ్ డాక్యుమెంట్లు(Bangladesh Documents) స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజా ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న దేశ రాజ‌ధాని అంత‌టా నిఘా పెంచారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. భద్రతా ప్రోటోకాల్‌లో భాగంగా ఆగస్టు 16 వరకు ఢిల్లీ అంతటా డ్రోన్ల‌పై నిషేధం విధించారు.