అక్షరటుడే, డిచ్పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా ఎన్నో ఏళ్ల విద్యార్థుల కల సాకారమైంది. తాజాగా మరో కీలక అడుగు ముందుకు పడింది. తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య ఆరతి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరి(Registrar Professor Yadagiri) ఉత్తర్వులు జారీ చేశారు.
తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. వైస్ ఛాన్స్ లర్ ప్రొ. యాదగిరిరావు (Vice Chancellor Prof. Yadagiri Rao) ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు రిజిస్టార్ తెలిపారు. ప్రిన్సిపల్‌గా నియమితులైన ప్రొ. ఆరతి కి పలువురు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.