అక్షరటుడే, న్యూఢిల్లీ: terror attack : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ RSS chief Mohan Bhagwat మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister narendra Modiతో ఆయన అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో నరేంద్ర మోడీ, మోహన్ భగవత్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతకు ముందు ప్రధాని మోదీ.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ Defense Minister Rajnath Singh, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ Chief of Defense Staff General Anil Chauhan, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ National Security Advisor Ajit Doval తో ఒక ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 23న జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు విపక్షాలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి.
ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం కేబినెట్ భద్రతా సంఘం (CCS) సమావేశం నిర్వహించింది. ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన చర్యలను పునరుద్ఘాటించారు. భారత సాయుధ దళాలపై పూర్తి నమ్మకం ఉందని, దేశ ప్రతీకార చర్యల కోసం అవసరమైన విధానం, లక్ష్యం, సమయం ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆర్మీకి కల్పించబడిందని మోడీ స్పష్టం చేశారు.