ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోసారి భారీగా పెరిగి, లక్ష రూపాయల మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశలో పెరుగుతున్నాయి.

    గ్లోబల్ స్థాయిలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతుండటం వల్ల బంగారానికి డిమాండ్‌ పెరిగి ధరలు ఎగబాకుతున్నట్లు కనిపిస్తోంది.

    ఆగస్టు 5న‌ నమోదైన ధరల ప్రకారం చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,410 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు ధరలు కొద్దిగా పెరిగాయి. తులం బంగారం కొందామంటే చేతిలో లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

    Today Gold Price : మ‌ళ్లీ పెరుగుద‌ల‌..

    ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు బంగారం ధ‌ర‌ అంతకు రెట్టింపు పెరిగిపోతోంది. దేశంలోని ప్ర‌ధాన న‌గరాల‌లో (24 క్యారెట్ (₹), 22 క్యారెట్ (₹)) 10 గ్రాముల బంగారం ధ‌ర‌లు చూస్తే..

    • హైదరాబాద్‌(Hyderabad)లో రూ. 1,01,410 – రూ. 92,960 కాగా,
    • విజయవాడ(Vijayawada)లో Vijaywada రూ. 1,01,410  –  రూ. 92,960
    • ఢిల్లీ(Delhi)లో రూ. 1,01,560 – రూ. 93,110
    • ముంబయి(Mumbai)లో రూ. 1,01,410 – రూ. 92,960
    • వడోదర(Vadodara)లో రూ. 1,01,460 –  రూ. 93,010
    • కోల్‌కతా(Kolkata)లో రూ. 1,01,410  – రూ. 92,960
    • చెన్నై(Chennai)లో రూ. 1,01,410 –  రూ. 92,960
    • బెంగళూరు(Bengaluru)లో రూ. 1,01,410 –  రూ. 92,960
    • కేరళ(Kerala)లో రూ. 1,01,410 – రూ. 92,960
    • పుణె(Pune)లో రూ. 1,01,410 – రూ. 92,960 గా ట్రేడ్ అయింది.

    ఇక వెండి ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1,22,900 కాగా, విజయవాడలో రూ. 1,22,900, ఢిల్లీలో రూ. 1,12,900, చెన్నైలో రూ. 1,22,900, కోల్‌కతాలో రూ. 1,12,900, కేర‌ళ‌లో రూ. 1,22,900, ముంబయిలో రూ. 1,12,900, బెంగళూరులో రూ. 1,12,900, వడోదరలో రూ. 1,12,900, అహ్మదాబాద్ లో రూ. 1,12,900గా ట్రేడ్ అయింది.

    కాగా వెండి Silver ధరలు నిన్నటితో పోల్చుకుంటే కొంత స్థిరంగానే ఉన్నాయనే చెప్పాలి. అయితే, పెళ్లిళ్ల స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు ఇలా పెరుగుతూ పోతుంటే కొనుగోలుదారులు తులం బంగారం కొనాల‌న్నా కూడా వెనుక‌డుగు వేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

    Latest articles

    Anil Ambani | రూ.17 వేల కోట్ల మోసం.. అనిల్​ అంబానీని విచారిస్తున్న ఈడీ అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anil Ambani | ప్రాముఖ వ్యాపారవేత్త, రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ అనిల్​ అంబానీ మంగళవారం...

    Vizianagaram | ట్యూష‌న్‌కి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌ బాలిక‌పై మాస్టార్ అత్యాచార య‌త్నం.. సాహ‌సం చేసి త‌ప్పించుకున్న బాలిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | మానవత్వాన్ని మంటగలిపే ఘటన విజయనగరం జిల్లాలో (Vizianagaram district) చోటు చేసుకుంది....

    Heroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన క్లారిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Hansika | ఇటీవలి కాలంలో సినీ ప్రపంచంలో విభేదాలతో విడాకులు తీసుకుంటున్న జంటల...

    Free Bus Scheme | ఏపీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై కీల‌క అప్‌డేట్.. ఎవ‌రు అర్హులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh Government) మహిళల కోసం మరో...

    More like this